Premalu : మరో సూపర్ హిట్ మలయాళ ప్రేమకథ చిత్రం తెలుగులో రిలీజ్.. ‘ప్రేమలు’

మలయాళం సినిమా 'ప్రేమలు' తెలుగు వాళ్లకి బాగా నచ్చేస్తుండటంతో ఈ సినిమాని తెలుగులోకి తీసుకురాబోతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Malayalam Super Hit Premalu Movie Releasing soon in Telugu

Malayalam Super Hit Premalu Movie Releasing soon in Telugu

ఇటీవల మన తెలుగులో ప్రేమ కథలు తక్కువగా వస్తున్నాయి. అసలు ఒకప్పుడు ప్రేమ కథలు(Love Stories) అంటే తెలుగులో బోలెడన్ని సినిమాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వాటి జాడే లేదు. దీంతో తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో వచ్చిన ప్రేమ కథలకు మన వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోతున్నారు. వేరే పరిశ్రమల్లో వచ్చిన ప్రేమ సినిమాలు అన్ని మన తెలుగు వాళ్ళకి తెగ నచ్చేస్తున్నాయి. దీంతో కొన్ని సినిమాలు తెలుగు డబ్బింగ్ లో కూడా రిలీజ్ అవుతూ ఇక్కడి ప్రేక్షకులని మెప్పిస్తున్నాయి.

కన్నడలో దియా, సప్త సాగరాలు దాటి, లవ్ మాక్‌టైల్.. తమిళ్ లో జోయ్, లవ్ టుడే, లవర్.. మలయాళంలో హృదయం.. లాంటి సినిమాలు తెలుగు వాళ్ళకి బాగా నచ్చేసాయి. ఇప్పుడు మరో మలయాళం సినిమా ‘ప్రేమలు’ తెలుగు వాళ్లకి బాగా నచ్చేస్తుండటంతో ఈ సినిమాని తెలుగులోకి తీసుకురాబోతున్నారు.

నస్లేన్, మమిత, శ్యామ్ మోహన్, సంగీత్, అఖిల.. ఇలా పలువురు యువ మలయాళీ నటీనటులతో గిరీష్ దర్శకత్వంలో నటుడు ఫహద్ ఫాజిల్ నిర్మాణంలో తెరకెక్కిన ప్రేమలు(Premalu) సినిమా ఫిబ్రవరి 9వ తేదీన మలయాళంలో రిలీజై భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో శివరాత్రి కానుకగా మార్చ్ 8న విడుదల చేయనున్నారు. ఈ సినిమాని రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా చాలా భాగం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకోవడం విశేషం.

Also Read : Kalki 2898AD : 6000 సంవత్సరాల కథ కల్కి.. ప్రభాస్ కల్కి 2898AD కథని రివీల్ వచ్చేసిన దర్శకుడు..

  Last Updated: 26 Feb 2024, 03:45 PM IST