2018 Movie : మలయాళం సూపర్ హిట్ “2018” సినిమా.. ఇప్పుడు తెలుగులో

ది కేరళ స్టోరీ(The Kerala Story) విడుదలైన రోజే మలయాళంలో "2018" అనే సినిమా కూడా రిలీజయింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో ముందుకు సాగుతూ బీభత్సమైన కలక్షన్స్ ను రాబడుతుంది.

Published By: HashtagU Telugu Desk
Malayalam Super Hit Movie 2018 now releasing in Telugu

Malayalam Super Hit Movie 2018 now releasing in Telugu

ప్రస్తుతం ఆడియన్స్ కి భాషతో సంబంధం లేకుండా ఒక మంచి సినిమా ఏ భాషలో ఉన్నా కూడా చూడటం అలవాటు అయిపోయింది. గత కొంతకాలంగా మలయాళం(Malayalam) సినిమాలు ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. చిన్న సినిమాలైనా దేశవ్యాప్తంగా మంచి విజయాలు సాధిస్తున్నాయి, ఇటీవల క్రిస్టి, ఇరట్ట, రోమాంచం, ది కేరళ స్టోరీ.. లాంటి పలు మలయాళం సినిమాలు మంచి విజయం సాధించాయి.

ది కేరళ స్టోరీ(The Kerala Story) విడుదలైన రోజే మలయాళంలో “2018” అనే సినిమా కూడా రిలీజయింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో ముందుకు సాగుతూ బీభత్సమైన కలక్షన్స్ ను రాబడుతుంది. ఇది కేవలం మలయాళంలోనే రిలీజ్ చేశారు. ఈ సినిమా మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ కేవలం రూ.1.85 కోట్లు మాత్రమే. కానీ అనూహ్యంగా కేవలం మౌత్ టాక్ తోనే పదిరోజుల్లో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. కేవలం మళయాళంలోనే రిలీజ్ చేసి ఇంత ఫాస్ట్ గా 100 కోట్లు సాధించిన సినిమాగా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది “2018”.

మలయాళ హీరో టోవినో థామస్ ముఖ్య పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. 2018 సంవత్సరం ఆగస్టు నెలలో కేరళలో కురిసిన అధిక వర్షాల వలన వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఇందులో సుమారుగా 164 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కేరళ చరిత్రలో ఈ శతాబ్దంలో ఇవే అతి పెద్ద వరదలు. ఈ వరదల్లో అనేకమంది నిరాశ్రులయ్యారు, అనాధలుగా మారారు. దీనిని ఆధారంగా తీసుకొని జూడ్ ఆంథనీ జోసెఫ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ కాబోతుంది. ప్రముఖ నిర్మాత బన్నీ వాసు GA2 పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. మే 26న ఈ సినిమాను తెలుగులో భారీగా రిలీజ్ చేయనున్నారు. ఇటీవల కాలంలో గీతా ఆర్ట్స్ వివిధ భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తూ సక్సెస్ అవుతుంది. ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలుగులో చూడాలి మరి.

 

Also Read :  Keerthy Suresh: సరైన సమయంలో నా మిస్టరీ మ్యాన్ ను పరిచయం చేస్తా: పెళ్లిపై కీర్తి సురేశ్ రియాక్షన్!

  Last Updated: 22 May 2023, 07:21 PM IST