Site icon HashtagU Telugu

Malayalam Director Siddique : నితిన్ డైరెక్టర్ కు గుండెపోటు

Malayalam director Siddique hospitalised

Malayalam director Siddique hospitalised

Heart Attack : ఇటీవల కాలంలో గుండెపోటు అనేది వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. ముఖ్యంగా కరోనా తర్వాత గుండెపోటు మరణాలు ఎక్కువైపోయాయి. కనీసం పట్టుమని 20 ఏళ్లు లేనివారు కూడా గుండెపోటుకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. సినీ , రాజకీయ , బిజినెస్ రంగాల వారితో పాటు నిత్యం ఫిట్ గా ఉంటూ..సరైన డైట్ ఫాలో అవుతున్న వారు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు.

ఇక చిత్రసీమలో చాలామంది గుండెపోటుతోనే మరణిస్తుంటారు. తాజాగా నితిన్ డైరెక్టర్ గుండెపోటుకు గురయ్యారని తెలుస్తుంది. మలయాళ చిత్ర పరిశ్రమ (Malayalam Filmmaker)కు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు సిద్దిఖీ ( Siddique Ismail) సోమవారం గుండెపోటు (Heart Attack)కు గురయ్యారు. గత కొద్దీ రోజులుగా ఈయన న్యుమోనియా మరియు కాలేయ వ్యాధితో బాధపడుతూ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమం (Critical Condition)గా ఉన్నట్లు డాక్టర్స్ చెపుతున్నారు. సిద్దిఖీ ఆరోగ్య పరిస్థితి ఫై కుటుంబ సభ్యులు , చిత్రసీమ ప్రముఖులతో పాటు , అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

1986లో ‘పప్పన్ ప్రియాపెట్టా పప్పన్’ అనే మలయాళ చిత్రంతో స్క్రీన్ రైటర్‌గా చిత్రసీమకు పరిచయం అయ్యాడు. 1989లో ‘రామ్‌జీ రావు స్పీకింగ్’ అనే మలయాళ చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్నారు. హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో సినిమాలు తీశారు. తెలుగు లో నితిన్ తో ‘మారో’ ( Maaro ) చిత్రాన్ని తెరకెక్కించాడు.

Read Also : Government Office : జగిత్యాల జిల్లాలో హెల్మెట్లు ధరించి విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు