Actresses Sexually Assaulted: మలయాళ హీరోయిన్స్ కు లైంగిక వేధింపులు!

కాలికట్‌లోని హిల్టే మాల్‌లో తమ సినిమాని ప్రమోట్ చేస్తున్న ఇద్దరు మలయాళ నటీమణులకు భయంకరమైన అనుభవం ఎదురైంది.

Published By: HashtagU Telugu Desk
Malayalam

Malayalam

కాలికట్‌లోని హిల్టే మాల్‌లో తమ సినిమాని ప్రమోట్ చేస్తున్న ఇద్దరు మలయాళ నటీమణులకు భయంకరమైన అనుభవం ఎదురైంది. కార్యక్రమం అనంతరం బయటకు వద్దకు వెళుతుండగా లైంగిక దాడికి పాల్పడ్డారు. కొంతమంది యువకులు హీరోయిన్స్ శరీర భాగాలను తాకుతూ వల్గర్ గా ప్రవర్తించారు. ఒకరు పట్టుకోవడానికి ప్రయత్నించిన సమయంలో ఓ హీరోయిన్  ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టడానికి కూడా ప్రయత్నించింది.  చాలామంది చుట్టుముట్టడంతో హీరోయిన్స్ బయటపడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇద్దరు తారలు తమ కష్టాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.

షాకింగ్ సంఘటనలో, ఇద్దరు నటీమణులు తమ రాబోయే సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో బహిరంగంగా లైంగిక వేధింపులకు గురయ్యారు. ‘‘నా చిత్ర బృందం మా కొత్త చిత్రాన్ని కాలికట్‌లోని ఒక మాల్‌లో ప్రమోట్ చేస్తున్నాము. ప్రమోషన్ ఈవెంట్‌లు కాలికట్‌లోని అన్ని ప్రదేశాలలో బాగా జరిగాయి. కాలికట్ ప్రజల ప్రేమకు ధన్యవాదాలు. మాల్ చాలా మందితో నిండిపోయింది. జనాన్ని కంట్రోల్ చేయడానికి భద్రత సిబ్బంది చాలా కష్టపడింది. ఈవెంట్ తర్వాత నేను మరో హీరోయిన్ బయటకు వెళ్లేందుకు ఎంట్రన్స్ కు వెళ్లాం. కొంతమంది నా సహనటితో అసభ్యంగా ప్రవర్తించారు. రద్దీ కారణంగా ఆ వ్యక్తులను అడ్డుకోలేకపోయాం. చిత్ర బృందం వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది’’ అంటూ రియాక్ట్ అయ్యింది హీరోయిన్.

  Last Updated: 28 Sep 2022, 03:37 PM IST