Actor Mohan Raj Passes Away: సినీ ప్రపంచానికి మరో ప్రముఖ నటుడు దూరమయ్యాడు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్ రాజ్ (Mohan Raj) 70 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన చాలా కాలంగా తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నారు. మోహన్ రాజ్ కేరళలోని కంజిరంకుళంలోని తన ఇంటిలో కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. అనేక మంది తమిళ, తెలుగు మరియు మలయాళ సూపర్‌స్టార్‌లతో పనిచేసిన మోహన్ రాజ్ సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.
మోహన్ రాజ్ పార్కిన్సన్స్(Parkinson) అనే వ్యాధితో మరణించారు. మోహన్ రాజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతని కుటుంబ సభ్యులు ఇంట్లోనే చికిత్స ఇస్తున్నారు. ఈ వ్యాధి మానవ శరీరం కదలికలను దెబ్బతీస్తుంది. ఈ వ్యాధి సమయంలో రోగులకు వణుకు సమస్య ఉంటుంది. లక్షణాలు సాధారణంగా అందరికీ భిన్నంగా ఉంటాయి. మోహన్ రాజ్ అకాల మరణంతో అతని స్నేహితులు, కుటుంబసభ్యులు మరియు అభిమానులు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తమ సంతాపాన్నివ్యక్తం చేశారు. మమ్ముట్టి కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో తన సంతాపాన్ని తెలియజేసారు.
మోహన్ రాజ్ మలయాళం, తమిళం మరియు తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించారు. ‘కిరీడం’లో కిరికడన్ జోస్ పాత్రతో మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత అతని అభిమానులు అతని పాత్ర పేరుతో పిలవడం ప్రారంభించారు. అతను టెలివిజన్ పరిశ్రమలో కూడా పనిచేశాడు.1988లో మోహన్‌లాల్‌తో తన కెరీర్‌ను ప్రారంభించాడు. వీళ్లిద్దరు ‘మూనం మురా’ అనే చిత్రంలో కలిసి పనిచేశారు. మోహన్ రాజ్ చివరిసారిగా 2022లో మమ్ముట్టితో కలిసి ‘రోర్స్చాచ్’ చిత్రంలో కనిపించారు.
Also Read: World Animal Welfare Day : స్వార్థాన్ని విడనాడి మూగ జీవులకు జీవించే అవకాశం ఇవ్వండి..!