Site icon HashtagU Telugu

Malavika Mohanan : తంగలాన్ సెట్ లో హీరోయిన్ కి వింత అనుభవం.. చెప్పకుండా డైరెక్టర్ ఆ పని చేయించాడట..!

Raja Saab Heroine Intresting Comments on Prabhas

Raja Saab Heroine Intresting Comments on Prabhas

Malavika Mohanan కబాలి సినిమాతో సౌత్ సెన్సేషన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పా రంజిత్ ఆ తర్వాత తన మార్క్ సినిమాలనే చేస్తూ వస్తున్నారు. పా రంజిత్ సినిమా వస్తుంది అంటే కొంతమంది ఆడియన్స్ అంతా ఎగ్జైటింగ్ గా ఉంటారు. ప్రస్తుతం పా రంజిత్ చియాన్ విక్రం తో తంగలాన్ సినిమా చేశాడు. విక్రం మరోసారి తన విలక్షణతను చూపించేలా ఈ తంగలాన్ సినిమా (Thangalan Movie) వస్తుంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది.

ఐతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ మాళవిక తను భయపడ్డ ఒక సందర్భం గురించి చెప్పింది. తంగలాన్ సినిమాలో ఒక సీన్ లో మాళవిక గేదె మీద ఎక్కాల్సి ఉందని డైరెక్టర్ చెప్పాడట. ఐతే సినిమా స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఈ విషయాన్ని డైరెక్టర్ చెప్పలేదట. ఐతే ఆ రోజు షూట్ కి వెళ్తే గేదె ఎక్కమని అన్నారట. ఐతే అది ముందు చెప్పలేదు కదా అని డైరెక్టర్ తో అన్నా సరే లేదు సినిమాకు ఈ సీన్ చాలా అవసరమని ఆమెను బలవంతంగా గేదెను ఎక్కించారట.

ఆ టైం లో తనకు చాలా భయం వేసిందని. అంతేకాదు సినిమా కోసం ప్రోస్తెటిక్ మేకప్ కోసం దాదాపు నాలుగు గంటలు టైం తీసుకున్నామని చెప్పుకొచ్చింది మాళవిక. తంగలాన్ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చి పెడుతుందని అంటున్నారు. అమ్మడు తెలుగు ఎంట్రీ కి కూడా సిద్ధమైంది. ప్రభాస్ (Prabhas) తో రాజా సాబ్ సినిమా చేస్తున్న మాళవిక ఆ సినిమాతో టాలీవుడ్ లో కూడా తన సత్తా చాటనుంది.

తప్పకుండా మాళవికకు తెలుగులో మంచి ఫ్యూచర్ ఉండేలా ఉందనిపిస్తుంది. ఖాళీ టైం లో తన ఫోటో షూట్స్ తో కూడా ఫాలోవర్స్ ని అలరిస్తున్న మాళవిక ఛాన్స్ వస్తే చాలు కానీ టాప్ ప్లేస్ కి వెళ్లేలా ఉంది.

Also Read : Sudher Babu : అక్కడ ఫ్లాప్ ఇక్కడ హిట్..!