Site icon HashtagU Telugu

Malavika Mohanan : సోషల్ మీడియా వేదికగా హీరోయిన్ పరువు తీసేశారుగా..?

Malavika Mohanan Super Answer For Netizen Who Targeted For Her Glamour Photoshoot

Malavika Mohanan Super Answer For Netizen Who Targeted For Her Glamour Photoshoot

Malavika Mohanan మలయాళ భామ మాళవిక మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా చేస్తుందని తెలిసిందే. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమాల కన్నా ఎక్కువ ఫోటో షూట్స్ తో క్రేజ్ తెచ్చుకుంటూ వస్తున్న మాళవిక తన ఫాలోవర్స్ తో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది.

ఈ క్రమంలో లేటెస్ట్ గా అమ్మడు తన ఎక్స్ ఫాలోవర్స్ తో స్పెషల్ చిట్ చాట్ చేసింది. అందులో వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది. అయితే ఒక నెటిజెన్ మాళవికను అడిగిన ప్రశ్నకు ఆమెకు కోపం తెప్పించింది. గ్లామర్ షో ఆపేసి యాక్టింగ్ ఎప్పుడు మొదలు పెడతావ్ అని మాళవికన్ అడిగాడు ఒక నెటిజెన్.

అందుకు సమాధానంగా అమ్మడు నేను ఎప్పుడు యాక్టింగ్ చేయను నీకేమైనా ప్రాబ్లమా అంటూ ఆన్సర్ ఇచ్చింది. మాళవిక చెప్పిన సమాధానానికి ఆమె ఫ్యాన్స్ సూపర్ అనేస్తున్నారు. హీరోయిన్స్ ఫోటో షూట్స్ వారి వారి వ్యక్తిగత ఆసక్తిని బట్టి ఉంటుంది. అలాంటి మాళవిక ఫోటో షూట్స్ పై నెటిజెన్ చేసిన కామెంట్ ఆమెకు చెర్రెత్తుకొచ్చేలా చేసింది.

అందుకే ప్రశ్నకు తగినట్టుగానే సమాధానం ఇచ్చింది అమ్మడు. రాజా సాబ్ హిట్ పడితే తెలుగులో వరుస ఛాన్సులు వచ్చేలా ఉన్నాయి. అయితే రాజా సాబ్ రిలీజ్ కన్నా ముందే తెలుగు ఆఫర్లు వస్తున్నా కాదని అంటుంది మాళవిక.

Also Read : Venkatesh : ఖమ్మం లో వెంకటేష్ ప్రచారం..ఫ్యామిలీ ఓట్లన్నీ ఆ అభ్యర్థికే అన్నమాట ..!!