టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ఆయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ కి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇకపోతే ప్రభాస్ ఇటీవల సలార్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుము విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే ప్రస్తుతం డార్లింగ్ చేతిలో దాదాపు ఆరు,ఏడు సినిమాలు ఉన్నాయి. అవన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాదండోయ్ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.
ఒక్కో సినిమా కోట్లు బడ్జెట్ తో నిర్మితమవుతోంది. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ రాజా సాబ్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాను పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు ప్రభాస్. ఈ సినిమా తర్వాత ఫౌజీ సినిమా విడుదల కానుంది. కాగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా హారర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్ నటిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటిస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా తమిళ్ హీరోయిన్ మాళవిక హీరో ప్రభాస్ పై ప్రశంసలు కురిపించింది. ప్రభాస్ ను సెట్ లో చూసి ఆశ్చర్యపోయాను అని తెలిపింది. అంత పెద్ద పాన్ స్టార్ హీరో అయ్యుండి చాలా నార్మల్ గా, ఎంతో సింపుల్‌గా, సపోర్టివ్ గా ఉంటాడు. షూటింగ్ సెట్ లో ఉన్న అందరితో సరదాగా మాట్లాడుతాడు. టీమ్ మొత్తానికి మంచి ఫుడ్ తెప్పిస్తాడు. అలాగే దగ్గర ఉండి మరీ బిర్యానీ వడ్డిస్తాడు. ఇవన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. నిజంగా ప్రభాస్ చాలా స్వీట్ అంటూ చెప్పుకొచ్చింది మాళవిక మోహనన్. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.