Malavika Mohanan: లక్కీ ఛాన్స్ కొట్టేసిన మలయాళ బ్యూటీ…ఏకంగా సల్మాన్ ఖాన్ తోనే..??

మలయాళ ముద్దుగుమ్మ మళవికా మోహన్ బాలీవుడ్ లో లక్కీ ఛాన్స్ కొట్టేసింది.

  • Written By:
  • Publish Date - May 27, 2022 / 09:39 PM IST

మలయాళ ముద్దుగుమ్మ మళవికా మోహన్ బాలీవుడ్ లో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో ఆమె రొమాన్స్ చేయబోతున్నట్లు సమాచారం. అసలు మాళవిక ఏం మూవీలో నటించబోతోంది…అందులోని నిజమెంత. తెలుసుకుందాం

మాళవిక మోహన్ కు బంపర్ ఆఫర్ తగిలింది. బాలీవుడ్ లో నటించాలనుకున్న ఈ బ్యూటీకి వెంటనే ఊహించని ఆఫర్ తగిలింది. ఏకంగా సల్మాన్ ఖాన్ పక్కనే నటించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి సౌత్ లో రకరకాలు పుకార్ల షికార్లు చేస్తున్నాయి. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఫర్హద్ సామ్ జీ డైరెక్షన్ లో కభీ ఈద్ కభీ దివాళి మూవీ చేస్తున్నారు.ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో సోషల్ మీడియా సెన్సేషన్ మాళవిక మోహనన్ మరో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై మాళవిక క్లారిటీ ఇచ్చింది.

సల్మాన్ తో యాక్ట్ చేస్తున్నా అనేది ఫేక్ అని తేల్చి చెప్పింది. సల్మాన్ ప్రాజెక్టు గురించి చాలా పుకార్లు వచ్చాయి. కానీ నేను ఆ ప్రాజెక్టులో నటించడంలేదని స్పష్టం చేసింది. అయితే సౌత్ లో తమిళ, మలయాళ సినిమాలు చేసిన బ్యూటీ తెలుగు డైరెక్ట్ గా మూవీ ఒక్కటి కూడా చేయలేదు. దీంతో టాలీవుడ్ పై శ్రద్ధ పెంచింది ఈ బ్యూటీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ డైరెక్టర్ మారుతి కాంబోలో రాబోతున్న మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. టాలీవుడ్ లో ఆమె క్రేజ్ సాధించినట్లయితే…పక్కాగా స్టార్ హీరోయిన్ గా తన ఇమేజ్ పెరిగినట్లేనని చెప్పాలి.