Site icon HashtagU Telugu

Malaika Arora: మలైకా హాట్ కామెంట్స్…చిన్నవాడితో డేటింగ్ చేస్తే తప్పేంటి..?

Malaika Imresizer

Malaika Imresizer

బాలీవుడ్ శృంగార తార మలైకా అరోరా..ఐటెం సాంగ్స్ తో ఓ ఊపు ఊపింది. 48ఏళ్ల వయస్సులోనూ హాట్ ఫోటోషూట్స్ తో కర్రాళ్లకు కునుకులేకుండా చేస్తోంది. ఈ బ్యూటీ గ్లామర్ కు ఫిదా కానివారెవ్వరూ లేరు. మలైకా అందాలు చూసే కుర్రాళ్లకు చెమటలు పట్టడం ఖాయం. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కూడా ఉన్నాయి. వాటన్నింటి డోంట్ కేర్ అంటుంది మలైకా. తనకు నచ్చినట్లు జీవిస్తాననని చెబుతుంది. సల్మాన్ ఖాన్ సోదరుడితో వివాహం…ఆ తర్వాత విడాకులు…ఇవన్నీ బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక…యంగ్ హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది ఈ హాట్ బ్యూటీ.

తనకంటే వయస్సులో 12 సంవత్సరాలు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తున్న మలైకా…పెద్దెత్తున ట్రోలింగ్ కు ఎదుర్కొంటున్నారు. నీ కంటే చిన్నవాడైన వ్యక్తితో ఎలా రిలేషన్ షిప్ లో ఉన్నావని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలపై మలైకా స్పందించింది. తన కంటే తక్కువ వయస్సున్న వ్యక్తితో ఒక మహిళ డేటింగ్ లో ఉంటే ఈ సమాజం ఎందుకు తప్పుగా చూస్తోందని ఎదురు ప్రశ్న వేసింది. డైవర్స్ తర్వాత కానీ, బ్రేకప్ తర్వాత కానీ ఒక మహిళా తనకంటూ ఓ జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పుకొచ్చింది.

అంతేకాదు ప్రతి మహిళా కూడా స్వశక్తితో ముందుకు సాగాలని సలహా కూడా ఇచ్చింది. ధైర్యంగా ఎలా జీవించాలన్న విషయాన్ని వాళ్ల అమ్మ నుంచి తాను నేర్చుకున్నానని చెప్పింది. నీకు చేయాలనిపించింది ధైర్యంగా చేయ్యూ అంటూ అమ్మ చెప్పేదని తెలిపింది. అమ్మ మాటలను తాను ఎక్కువగా నమ్ముతానని చెప్పుకొచ్చంది మలైకా.

Exit mobile version