Site icon HashtagU Telugu

Malaika and Arjun: బాలీవుడ్ లో పెళ్లి భాజాలు.. ఒక్కటికాబోతున్న మలైకా, అర్జున్ కపూర్!

Malika And Arjun

Malika And Arjun

మలైకా అరోరా, అర్జున్ కపూర్ జంట డేటింగ్ లో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. నాలుగు సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఈ ఇద్దరూ తమ రిలేషన్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. పెళ్లితో ఒకటి కావాలని ఆశపడుతున్నారు. మలైకా అరోరా రెండు హృదయాల ఎమోజీలతో “Yes I am Said” అనే క్యాప్షన్‌తో తన ఫోటోను షేర్ చేయడం వైరల్ గా మారింది. ఫోటోలో మలైకా ఆనందంతో నవ్వుతూ కనిపించింది. ఆమె బుగ్గలు కూడా ఎరుపెక్కాయి. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే మలైకా పోస్ట్ వైరల్‌గా మారింది.

నెటిజన్లు, ఆమె స్నేహితులు మలైకకు శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ మీడియా కూడా ఈ జంట పెళ్లి చేసుకోబోతోందని ప్రకటించింది కూడా. మలైకా ఇంతకుముందు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాల ఇద్దరూ బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది. 19 ఏళ్ల వివాహా బంధానికి గుడ్ బై చెప్పింది. మలైకకు 19 ఏళ్ల అబ్బాయి అర్హాన్ ఖాన్‌ ఉన్నాడు. ఈ పెళ్లి వార్త నిజమైతే బాలీవుడ్ లో మరోసారి పెళ్లి భాజాలు మొగడం ఖాయమే.