Site icon HashtagU Telugu

Malaika Arora: మలైకా కారుకు యాక్సిడెంట్..ఆసుపత్రిలో చేరిన బ్యూటీ..!!

Malaika

Malaika

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురైంది. ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. పూణేలోని ఓ ఫ్యాషన్ ఈవెంట్ కు హాజరవ్వడానికి కారులో పయనమైంది మలైకా. ముంబై నగరశివారులో మలైకా కారు ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్ లో మలైకాకి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. మలైకా సోదరి అమ్రితా ఓ మీడియా పోర్టల్ కు వెల్లడించింది.

ముంబై పూణే ఎక్స్ ప్రెస్ వేలో ఈ యాక్సిడెంట్ జరిగినట్లు ఖోపోలి పోలీసులు తెలిపారు. మూడు కార్లు ఒకదానిపై మరొకటి దూసుకెళ్లాయి. దీంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మూడు కార్లకు డ్యామేజ్ అయ్యిందని పోలీసులు చెబుతున్నారు. ఎఫ్ ఐఆర్ రిజిస్టర్ చేశామని..విచారణ మొదలుపెడతామని పోలీసులు తెలిపారు.

ఇక మలైకా ప్రస్తుతం ఆమె చేతుల్లో సినిమాలు ఛాన్సులు లేవు. కానీ కొన్ని టీవీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తోంది. తనకంటే చిన్న వయస్సులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తుంది మలైకా. ఇద్దరి మధ్య 12సంవత్సరాల తేడా ఉంది. వయస్సుతో సంబంధం లేకుండా తమ లవ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది ఈ జంట. కానీ వీరి ప్రేమ గురించి తరచుగా ట్రోల్స్ వస్తుంటాయి.