Site icon HashtagU Telugu

Mahesh Leaked Look: ఎస్ఎస్ రాజ‌మౌళి మూవీలో మ‌హేష్ లుక్ ఇదేనా.. సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్‌!

Mahesh Leaked Look

Mahesh Leaked Look

Mahesh Leaked Look: టాలీవుడ్ టాప్ డెరెక్ట‌ర్ ఎస్ఎస్ రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Leaked Look) కాంబినేష‌న్ మూవీలో వ‌స్తోన్న మూవీకి ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన అవ‌స‌రంలేదు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్‌ను సైలెంట్‌గా స్టార్ట్ చేసిన జ‌క్క‌న్న త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబంధించిన అధ‌కారిక ప్ర‌క‌ట‌న ఇచ్చేందుకు సిద్ధ‌మైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక లీక్‌ను కూడా బ‌య‌ట‌కు రాకుండా రాజ‌మౌళి చాలా జాగ్ర‌త్తలు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి మూవీ న‌టీన‌టుల‌కు ప‌లు ర‌కాలు ఆంక్ష‌లు విధించినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఫోన్లు నిషేధ‌మ‌ని ఆయ‌న చెప్పిన‌ట్లు సమాచారం.

అయితే ఈ మూవీలో మ‌హేష్ బాబు లుక్‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. తాజాగా సూప‌ర్ స్టార్ లుక్‌కు సంబంధించి ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వైర‌ల్ అవుతున్న వీడియోలో మహేష్ బాబు జిమ్ వీడియోలో క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. అలాగే సూప‌ర్ స్టార్ హెయిర్ స్టైల్ కూడా కొత్త‌గా అనిపిస్తుంది. ఎప్పుడూ నార్మ‌ల్‌గా ఉండే మ‌హేష్ హెయిర్ స్టైల్ ఈ మూవీలో కాస్త డిఫ‌రెంట్‌గా (రింగులు రింగులు) ఉండ‌నున్న‌ట్లు వీడియో చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఈ వీడియోలో మ‌హేశ్ షాట్‌, టీ ష‌ర్ట్ మీద ఉన్నారు. అయితే ఈ వీడియోను మ‌హేష్‌కు తెలియ‌కుండా తీసిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Also Read: Jasprit Bumrah: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున బుమ్రా ఆడ‌తాడా?

ఎస్ఎస్ఎంబీ 29 మూవీకి ఇంకా టైటిల్ ఖ‌రారు చేయ‌లేదు. అయితే ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కించేందుకు జ‌క్క‌న్న ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ మూవీ అడ్వెంచ‌ర్ నేప‌థ్యంలో సాగ‌నుందని స‌మాచారం. దాదాపు రూ. 1000 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీలో మ‌హేష్ బాబుతో పాటు బాలీవుడ్ భావ ప్రియాంక చోప్రా, మ‌రో ఇంట‌ర్నేష‌న‌ల్ హీరోయిన్‌, త‌దిత‌రులు ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఈ మూవీకి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ను రాజ‌మౌళి తీస్తున్న‌ట్లు టాక్‌.