Maheshbabu ‘Pokiri: మహేశ్ బర్త్ డే కు ‘పోకిరి’ గ్రాండ్ రిలీజ్.. హాట్ కేక్స్ లా అమ్ముడైన టికెట్స్!

టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా జరగనున్న సూపర్‌హిట్ చిత్రం 'పోకిరి'

Published By: HashtagU Telugu Desk
Pokiri1

Pokiri1

టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా జరగనున్నాయి. బర్త్ డే ట్రీట్ గా మహేశ్ సూపర్‌హిట్  ‘పోకిరి’ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. అభిమానుల కోసం ప్రత్యేక షోలు ప్రదర్శించనున్నారు. పోకిరి ద్వారా వచ్చే ఆదాయం మహేష్ బాబు ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టనున్నారు. పిల్లల విద్య, గుండె ఆపరేషన్లకు ఈ నిధులు ఉపయోగపడతాయి. ఈ మేరకు అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. “ప్రపంచ వ్యాప్తంగా ‘పోకిరి’ కోసం ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసినందుకు సూపర్ అభిమానులందరికీ ధన్యవాదాలు! అందరి ప్రేమకు చాలా కృతజ్ఞతలు!” అంటూ స్పందించారు.

పోకిరి రీరిలీజ్ చేయనున్నట్టు ప్రకటించిన నిమిషాల వ్యవధిలో టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అన్ని చోట్ల మహేశ్ అభిమానులు, పంపిణీదారులు పోకిరి సినిమాలను చూసి, ఆ మొత్తంగా వచ్చే డబ్బులను MB ఫౌండేషన్ కు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ‘‘మేం మహేశ్ అభిమానులం అయినందుకు చాలా గర్వపడుతున్నాం. కచ్చితంగా ఆగస్టు 9 మాకు చాలా స్పెషల్. మహేశ్ అభిమానులం అయినందుకు ఆయన అడుగుజాడల్లో నడుస్తాం’’ అంటూ అభిమానులు స్పందించారు. కాగా రాజమండ్రిలో మహేశ్ మరో సూపర్ హిట్ మూవీ ఒక్కడు రీరిలీజ్ చేయడంతో థియేటర్లన్నీ నిండిపోయాయి.

  Last Updated: 04 Aug 2022, 01:36 PM IST