సూపర్ స్టార్ మహేష్ (Superstar Mahesh) నెక్స్ట్ సినిమా కోసం అంతా సిద్ధం చేసుకున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ చేయబోతున్న భారీ బడ్జెట్ సినిమా కోసం ఇప్పటికే మహేష్ తన లుక్ ని మార్చుకున్నాడు. మహేష్ 28 సినిమాలు ఒక లెక్క ఈ సినిమా మరో లెక్క అనిపించేలా ఈ మూవీ రాబోతుంది. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ పూర్తిస్థాయి మేకోవర్ చూపించబోతున్నారు.
మహేష్ 29వ సినిమా విషయంలో ఫ్యాన్స్ అంతా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఐతే ఈ సినిమా కోసం వర్క్ షాప్ మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది. సినిమా వర్క్ షాప్ ట్యూటర్ గా నాజర్ ని నియమించారట రాజమౌళి. ఈ సినిమాలో ఆయన కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారని తెలుస్తుంది.
మహేష్ సినిమా కోసం రాజమౌళి (Rajamouli) ఏర్పాటు చేస్తున్న వర్క్ షాప్ కోసం నాజర్ (Nassar) ట్యూటర్ గా పనిచేయబోతున్నారట. కథకు తగినట్టుగా ఆహార్యం, డిక్షన్ ఇలాంటి విషయాల మీద మహేష్ అండ్ టీం వర్క్ షాప్ చేయబోతున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం మహేష్ చాలా వాటిల్లో ప్రావీణ్యం పొందాల్సి ఉంటుంది. అందుకే సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే ఈ భారీ వర్క్ షాప్ ని ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది.
రాజమౌళి మహేష్ కాంబో సినిమాను కె.ఎల్ నారాయణ (KL Narayana) నిర్మిస్తున్నారు. సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ (Hollywood Technicians)ని తీసుకుంటున్నారని తెలుస్తుంది. SSMB 29వ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. కచ్చితంగా ఈ సినిమా ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అందిస్తుందని చెప్పొచ్చు. సినిమాను త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లి 2026 లో రిలీజ్ ప్లాన్ చేసేలా చర్చలు జరుగుతున్నాయి. ఐతే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తారని తెలుస్తుంది. మహేష్ చేయబోతున్న మొదటి పాన్ ఇండియా సినింగా ఎస్.ఎస్.ఎం.బి 29 పై ఆకాశమే హద్ధు అనే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.
Also Read : Prabhas Kalki Effect Raja Saab Next Level Business : కల్కి ఎఫెక్ట్.. రాజా సాబ్ బిజినెస్ అదుర్స్..!