Site icon HashtagU Telugu

Super Star Krishna : చాలా మిస్ అవుతున్నా నాన్న – మహేష్ ఎమోషనల్ ట్వీట్

Krishna Bday

Krishna Bday

సూపర్ స్టార్ కృష్ణ జయంతి (Super Star Krishna Birthday) సందర్భంగా ఆయన్ను గుర్తుచేసుకుంటూ తనయుడు మహేశ్ బాబు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసారు. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ జయంతి నేడు. 1943 మే 31న గుంటూరు జిల్లా, తెనాలి మండలములో తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామస్తులైన ఘట్టమనేని నాగరత్నమ్మ, వీరరాఘవయ్య చౌదరి దంపతుల పెద్ద కొడుకుగా జన్మించాడు.

We’re now on WhatsApp. Click to Join.

తెలుగు సినిమాకి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన లెజెండ్, నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ. మొదటి స్టీరియో సౌండ్, మొదటి సినిమా స్కోప్, మొదటి 70 MM, మొదటి జేమ్స్ బాండ్, మొదటి కౌబోయ్.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచిన కథానాయకుడు కృష్ణ. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కృష్ణ . 350కిపైగా చిత్రాల్లో నటించారు. ఎవరికీ సాధ్యం కాని రికార్డులు సృష్టించారు. 1969లో ఏకంగా ఆయన 19 సినిమాలు చేశారు. 50 మల్టీస్టారర్ సినిమాల్లో నటించి సరికొత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. 105 మంది దర్శకులు, 80 మంది హీరోయిన్లు, 52 మంది మ్యూజిక్ డైరెక్టర్లతో ఆయన పని చేసిన ట్రాక్ రికార్డు ఆయన సొంతం. అప్పట్లో కృష్ణకు 2,500 అభిమాన సంఘాలు ఉండేవి అంటే అర్ధం చేసుకోవాలి..కృష్ణ అంటే ఎంత ఇష్టమో. అలాంటి కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా తెలుగు రాష్ట్రాల అభిమానులే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఘట్టమనేని ఫ్యాన్స్ పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నారు.

ఈ సందర్బంగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తన ట్విట్టర్ (X) లో ఎమోషనల్ పోస్ట్ చేసారు. ‘హ్యాపీ బర్త్ డే నాన్నా. నిన్ను చాలా మిస్ అవుతున్నా. నా ప్రతి జ్ఞాపకంలో మీరెప్పటికీ జీవించి ఉంటారు’ అని పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో కృష్ణను చూస్తుంటే మహేశానే ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2022 నవంబర్ 15న కృష్ణ తుదిశ్వాస విడిచారు.

Read Also : Prajwal Revanna: ఎట్టకేలకు ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్.. వాట్ నెక్స్ట్..?