Site icon HashtagU Telugu

Mahesh Thank you Boss : మహేష్ థాంక్ యు బాస్ చెబుతున్నాడు.. సూపర్ స్టార్ క్రేజ్ కి ఇది నిదర్శనం..!

Is Mahesh Babu Tag Change From Super Star to Gold Star

Is Mahesh Babu Tag Change From Super Star to Gold Star

Mahesh Thank you Boss సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ కి ఇదొక నిదర్శనం. టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్.. క్రేజ్ ఉన్న హీరోగా మహేష్ తన స్టామినా చాటుతూ వస్తున్నారు. అందుకే సినిమాలతోనే కాకుండా వాణిజ్య ప్రకటనలతో కూడా మహేష్ అదరగొట్టేస్తున్నాడు. లేటెస్ట్ గా మహేష్ ని వాడేశారు ప్రముఖ సంస్థ ఫోన్ పే. డిజిటల్ పేమెంట్స్ లాంటి అన్ని బ్యాంకింగ్ సేవలను ఫోన్ పే ద్వారా చేసుకునే అవకాశం ఉంది. అయితే తమ యూజర్స్ ని మరింత థ్రిల్ చేసేలా ప్రతి పేమెంట్ కి ఫోన్ పే మహేష్ థాంక్ యు బాస్ మెసేజ్ ని వచ్చేలా చేసింది.

ఏదైనా ఒక పేమెంట్ స్కాన్ లేదా ఫోన్ నెంబర్ తో చేస్తే పేమెంట్ ఐన వెంటనే సెండ్ చేసిన వారికి థాంక్ యు బాస్ అనే వాయిస్ వినిపిస్తుంది. నార్త్ సైడ్ అమితాబ్ వాయిస్ ని వాడేశారు ఫోన్ ప్లే. మలయాళంలో మమ్ముట్టి, కన్నడలో సుదీప్ వాయిస్ లను వాడుకున్నారు. తెలుగులో మహేష్ వాయిస్ ని వాడేశారు.

ఇందుకోసం మహేష్ కి భారీ రెమ్యునరేషన్ అందించినట్టు తెలుస్తుంది. సినిమాలతో పాటుగా మహేష్ వాణిజ్య ప్రకటనలు మిగతా వాటి ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నారు. అయితే తనకు ఇలా బయట నుంచి వచ్చే సంపాదనతో చిన్న పిల్లల గుండె ఆపరేషన్ కి ఖర్చు చేస్తున్నాడు మహేష్. అందుకే మహేష్ వాణిజ్య ప్రకటనలు చేసినా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంకరేజ్ చేస్తుంటారు.