Site icon HashtagU Telugu

Mahesh – Rajamouli : చేరుకోదారి చూసుకున్న మహేష్ , రాజమౌళి ఎందుకు..?

Rajamouli Mahesh

Rajamouli Mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి (Mahesh & Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న SSMB 29 సినిమా షూటింగ్ కు స్మాల్ బ్రేక్ పడింది. ఒడిశాలో ఇటీవలే కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత, చిత్ర యూనిట్ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. ఈ సందర్భంగా మహేష్ బాబు తన భార్య నమ్రత, కుమార్తె సితారతో కలిసి యూరప్ వెకేషన్‌కు వెళ్లారు. ఇటలీ టస్కానీ ప్రాంతంలోని అందాలను ఆస్వాదిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

LSG vs GT: గుజ‌రాత్‌కు షాకిచ్చిన ల‌క్నో.. ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన పోరులో పంత్ సేన‌దే విజ‌యం!

ఇటు రాజమౌళి తన కుటుంబ సభ్యులతో కలిసి జపాన్‌ పర్యటనకు వెళ్లారు. అక్కడ RRR: బిహైండ్ & బియాండ్ అనే డాక్యుమెంటరీను ప్రమోట్ చేయడం కోసం వెళ్లిన ఆయన, జపనీయ ప్రేక్షకులతో RRR సినిమాకు సంబంధించిన అనుభవాలను పంచుకుంటున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ కు జపాన్‌లో వచ్చిన ఘన విజయంతో ఈ డాక్యుమెంటరీకు కూడా మంచి స్పందన లభిస్తుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు సినిమా గురించి కూడా ఏదైనా అప్డేట్ ఇస్తారా అన్న ఆత్రుత అభిమానుల్లో కనిపిస్తోంది.

ఇక ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి ప్రముఖులు ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో, వారి ప్రస్తుత బిజీ షెడ్యూల్‌ కూడా సినిమాపై ప్రభావం చూపుతోంది. ప్రియాంక లాస్ ఏంజిల్స్ వెళ్లి క్రిష్ 4 కోసం హృతిక్‌తో మీటింగ్ జరిపినట్లు సమాచారం. పృథ్వీరాజ్ కూడా ఇతర ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో నటీనటులు తమ ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ తిరిగి సెట్ లో జాయిన్ అవుతారని సమాచారం. SSMB 29 ను హాలీవుడ్ స్థాయిలో రూపొందించేందుకు రాజమౌళి బృందం సిద్ధమవుతోంది.