Mahesh Rajamouli Movie సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా విషయంలో ఇంకా కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది. ఇటీవలే గుంటూరు కారంతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న మహేష్ రాజమౌళి సినిమా కోసం రెడీ అయ్యాడు. రీసెంట్ గా సినిమా కోసమే జర్మనీ వెళ్లాడని టాక్. మహేష్ స్టైలిష్ లుక్ కోసమే రాజమౌళి జర్మనీ తీసుకెళ్లాడని అంటున్నారు. అయితే ఈ సినిమాను కేవలం ఏడాదిలో పూర్తి చేయాలని అనుకుంటున్నాడట రాజమౌళి. జక్కన్న సినిమా ఏడాదిలో పూర్తి చేయడం అసాధ్యమని ఆడియన్స్ అంటున్నారు.
We’re now on WhatsApp : Click to Join
అవును నిజమే మహేష్ లాంటి హీరోతో రాజమౌళి (Rajamouli) చేసే ఈ సినిమా సంవత్సరంలో పూర్తి చేయడం అన్నది జరిగే పని కాదు. కానీ రాజమౌళి మాత్రం అందుకు తగిన ప్లాన్ లోనే ఉన్నాడట. ముందే వర్క్ షాప్ ఏర్పాటు చేసి ఆ తర్వాత సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడట. ఇక సెట్స్ మీద సినిమా వరుస షూటింగ్స్ తో అనుకున్న విధంగా ఏడాది మహా అంటే మరో ఆరు నెలల్లో పూర్తి చేయాలని అనుకుంటున్నాడట.
మహేష్ (Mahesh Babu) తో సినిమా అంటే ఏడాదిలో పూర్తి కావడం అన్నది కాని పని కాని రాజమౌళి ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి. ఈ సినిమా కోసం మహేష్ అన్ని విధాలుగా సిద్ధం అవుతున్నాడు. గుంటూరు కారమే మహేష్ చివరి ప్రాంతీయ సినిమా.. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ కూడా గ్లోబల్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంటాడు. అందుకే మహేష్ కూడా జక్కన్న సినిమాకు ఏం కావాలన్నా అది చేసేందుకు రెడీ అవుతున్నాడు.
Also Read : Vijay Devarakonda : రౌడీ హీరో కోసం ఇద్దరు క్రేజీ హీరోయిన్స్..!
మహేష్ రాజమౌళి కాంబో సినిమాను కె.ఎల్ నారాయణన్ నిర్మిస్తున్నారు. సినిమా 300 కోట్ల పైన బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా వస్తుందట. సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది.. తప్పకుండా ఈ సినిమాతో మరో సంచలనానికి నాంధి పలుకుతున్నాడు రాజమౌళి.
మహేష్ తో రాజమౌళి సినిమా అనగానే ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. సినిమా ఇంతకుముందు తెలుగు సినిమా రికార్డులన్నీ తిరగ రాస్తుందని ఫిక్స్ అవుతున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ పనిచేస్తారని తెలుస్తుండగా త్వరలోనే ఆ వివరాలు అనౌన్స్ చేస్తారని టాక్.