Mahesh Rajamouli సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటు ఇంటర్నేషనల్ లెవెల్ లో మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ రాజమౌళి సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా రాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి కొన్ని లీక్స్ ఇస్తుండగా లేటెస్ట్ గా సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
మహేష్ సినిమా జనవరి నుంచి షూటింగ్ మొదలవుతుందని అన్నారు విజయేంద్ర ప్రసాద్. SSMB29 కోసం మహేష్ ఇదివరకు ఎప్పుడు చూడని లుక్ ట్రై చేస్తున్నాడు. గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాడు. రాజమౌళి ఈ సినిమా కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు అర్ధమవుతుంది. జనవరి నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుండగా ఈలోగా కొంత వర్క్ షాప్ పూర్తి చేస్తారని తెలుస్తుంది.
ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్..
మహేష్ రాజమౌళి సినిమా ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఇక ఈ సినిమా కోసం టెక్నికల్ టీం ను హాలీవుడ్ నుంచి దించుతున్న జక్కన్న మహేష్ తో జత కట్టే హీరోయిన్స్ విషయంలో కూడా పెద్ద ప్లానింగ్ లోనే ఉన్నాడని తెలుస్తుంది.
మహేష్ 29వ సినిమాకు సూపర్ స్టార్ బల్క్ డేట్స్ ఇచ్చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు కనీసం 3 ఏళ్లైనా టైం కేటాయించాల్సి ఉంటుందని తెలుస్తుంది. సినిమా అంతా అనుకున్నట్టుగా జరిగితే 2026 ఎండింగ్ లేదా 2027 లో రిలీజ్ ఉంటుందని చెప్పొచ్చు.