SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సంచలనం గుంటూరు కారం. ఈ సినిమాకి మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర 231 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. రీజనల్ మూవీస్ లో హయ్యస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా గుంటూరు కారం రికార్డ్ క్రియేట్ చేసింది. గుంటూరు కారం వచ్చింది.. వెళ్లింది.. మరి మహేష్ నెక్ట్స్ ఏంటి అంటే.. జక్కన్నతో సినిమా. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ భారీ, క్రేజీ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరంలో ఉగాది నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ రూపొందిస్తున్నారట. ఈ సెట్ కోసం దాదాపు 100 కోట్ల బడ్జెట్ అవుతుందట. ఈ సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత ఆఫ్రికా, యూరప్ లో మిగిలిన పార్ట్ చిత్రీకరిస్తారట.
ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారని.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి నటీనటుల ఎంపిక జరుగుతుందని తెలిసింది. పాన్ ఇండియా మూవీగా కాదు.. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారట. ఇక ఈ సినిమా రిలీజ్ ఎప్పుడంటే.. 2026 ఉగాదికి అని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. రాజమౌళి సినిమా అంటే.. మూడేళ్లు తప్పకుండా పడుతుంది. అయితే.. ఈసారి జక్కన్న ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారట. అందుచేత 2026 ఉగాదికి ఈ మూవీ రిలీజ్ చేయాలి అనేది ప్లాన్ అట. మరి.. అంతా అనుకున్నట్టుగా జరిగి 2026 ఉగాదికి మహేష్, జక్కన్న పాన్ వరల్డ్ మూవీ థియేటర్లోకి వస్తుందేమో చూడాలి.
Also Read: Union Budget 2024 : ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్.. ఫోకస్ ఈ 5 అంశాలపైనే !