సూపర్ స్టార్ మహేష్ నెక్స్ట్ రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. గుంటూరు కారం తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలితో పాన్ ఇండియా.. RRR తో ఇంటర్నేషనల్ లెవెల్ లో సత్తా చాటిన రాజమౌళి.. నెక్స్ట్ సినిమా మహేష్ (Mahesh) కోసం భారీ ప్లానింగ్ తోనే వస్తున్నాడు జక్కన్న. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ లో కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ SSMB29 సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎంపిక జరుగుతుంది.
ప్రస్తుతం రాజమౌళి అండ్ టీం సినిమా కోసం లొకేషన్స్ వేట కొనసాగిస్తుంది. ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం మహేష్ రాజమౌళి (Rajamouli) సినిమా 1000 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట. తెలుగు సినిమా ఒకప్పుడు 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టేందుకు కష్టపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు బడ్జెట్ తోనే మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నారు.
కల్కి 1 తోనే 1000 కోట్లు..
ముఖ్యంగా కల్కి కూడా వైజయంతి మూవీస్ 500 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కించారు. కల్కి 1 తోనే 1000 కోట్లు కొల్లగొట్టారు. ఐతే ఇప్పుడు రాజమౌళి మహేష్ సినిమా కోసం 1000 కోట్ల బడ్జెట్ ఫిక్స్ చేస్తున్నారట. ఈ సినిమా కూడా బాహుబలి తరహాలో రెండు భాగాలుగా చేస్తారని తెలుస్తుంది. ఇప్పటివరకు మహేష్ కేవలం తెలుగు సినిమాలే చేయగా ఇప్పుడు ఒకేసారి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు.
మహేష్ రాజమౌళి ఈ కాంబో సినిమా అనగానే ఆడియన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ అంచనాలకు తగినట్టుగానే 1000 కోట్ల బడ్జెట్ అంటే ఆ అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. మరి సినిమాను జక్కన్న ఏం చేస్తాడో కానీ బడ్జెట్ తోనే మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నారని చెప్పొచ్చు.