Mahesh -Rajamouli Movie : ఐదేళ్లు రాజమౌళి చేతిలో మహేష్..?

Mahesh -Rajamouli Movie : ఇక ఈమూవీ రెండు పార్టులుగా తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి. బాహుబలిని రెండు పార్ట్‌లుగా విడుదల చేసిన రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కథ పెద్దది అయినా ఒకే పార్ట్‌లో తెరకెక్కించారు

Published By: HashtagU Telugu Desk
SSMB 29 Update

SSMB 29 Update

Mahesh -Rajamouli Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి (Mahesh Babu – Rajamouli )కలయికలో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటు ఇంటర్నేషనల్ లెవెల్ లో మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ – రాజమౌళి కలయికలో సినిమా చూడాలని ఎప్పటి నుండో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి ఈ సినిమాను ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) ఈ సినిమా గురించి కొన్ని లీక్స్ ఇవ్వడం తో ఈ మూవీ పై అంచనాలు పెరిగిపోయాయి.

ఇక ఈమూవీ రెండు పార్టులుగా తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి. బాహుబలిని రెండు పార్ట్‌లుగా విడుదల చేసిన రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కథ పెద్దది అయినా ఒకే పార్ట్‌లో తెరకెక్కించారు. కానీ మహేష్‌ బాబుతో తీయబోతున్న సినిమాను మాత్రం రెండు పార్ట్‌లుగా విడుదల చేయాలని ముందుగానే డిసైడ్ అయ్యాడట. ఇదే విషయాన్ని మహేష్ బాబు తో కూడా చెప్పి..ఆయన ఓకే అన్నతర్వాతే మిగతా పనులు స్టార్ట్ చేశారట. 2025 సమ్మర్‌ నుంచి మొదటి పార్ట్‌ రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించి సినిమాను 2027లో విడుదల చేయాలనీ అనుకుంటున్నారట. రెండో పార్ట్‌ను 2029లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నాడట. రాజమౌళి ఏం చేసినా పక్కా ప్లాన్‌తో ..ముందస్తుగా ప్లాన్‌ చేసుకుంటారు. అందులో భాగంగానే మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాను రెండు పార్ట్‌లుగా రెండేళ్లకోసారి విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యాడట. రెండు పార్ట్‌లు కలిపి దాదాపుగా అయిదు సంవత్సరాల సమయం తీసుకోనుంది. అంటే మహేష్ బాబు కెరీర్‌లో అయిదు ఏళ్లు పూర్తిగా రాజమౌళికి కేటాయించాల్సి ఉంటుంది. సో ఫ్యాన్స్ మహేష్ నుండి సినిమా చూడాలంటే గట్టిగానే ఓపిక పట్టాల్సి ఉంటుంది.

Read Also : Bhuvanagiri : విద్యార్థినితో వంట చేయించిన ప్రిన్సిపాల్.. నూనె పడి గాయాలు

  Last Updated: 18 Dec 2024, 07:35 PM IST