Site icon HashtagU Telugu

Kurchi Madatapetti Video Song : గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి సాంగ్ వచ్చేసింది..!

Mahesh Babu Kurchi Madatapetti Song record views in Youtube

Mahesh Babu Kurchi Madatapetti Song record views in Youtube

Kurchi Madatapetti Video Song సూపర్ స్టార్ మహేష్ నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా కు థమన్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా మీనాక్షి చౌదరి మహేష్ మరదలి పాత్రలో నటించింది.

We’re now on WhatsApp : Click to Join

ఇన్నాళ్లు మహేష్ అంటే సూపర్ యాక్టింగే అనుకున్నారు. డ్యాన్సుల్లో వీక్ అంటూ కామెంట్ చేశారు. కానీ గుంటూరు కారంతో తనకు డ్యాన్స్ కూడా వచ్చని ప్రూవ్ చేశాడు.

మహేష్ గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ లో దుమ్ము దులిపేశాడు. తెర మీద డ్యాన్స్ తో అదరగొట్టేది మహేష్ బాబేనా అనే రేంజ్ లో డ్యాన్స్ వేశాడు. సినిమా కోసం సూపర్ స్టార్ రిపీటెడ్ గా వెళ్లారు అంటే అది ఆ సాంగ్ కోసమే అని చెప్పొచ్చు.

Also Read : Rajamouli Mahesh : మహేష్ రాజమౌళి సినిమాలో ఆ స్టార్.. జక్కన్న ప్లాన్ చేస్తే రికార్డులు బద్ధలవ్వాల్సిందే..!

అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గుంటూరు కారం అఫీషియల్ వీదియో సాంగ్ రిలీజైంది. ఆ కుర్చీ మడతపెట్టి అంటూ మహేష్ వేసిన మాస్ స్టెప్స్ ఇప్పుడు యూట్యూబ్ ని షేక్ చేసేందుకు వచ్చింది. ఇప్పటికే గుంటూరు కారం సినిమాలో సాంగ్స్ ట్రెండింగ్ లో ఉండగా ఈ వీడియో సాంగ్ భారీ వ్యూస్ రాబట్టుకోవడం పక్కా అని చెప్పొచ్చు.