Site icon HashtagU Telugu

Mahesh : ఈడీకి మహేష్ బాబు రిక్వెస్ట్ లెటర్

Mahesh Ed Office

Mahesh Ed Office

సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీ(Saisurya Developers, Surana Group of Companies)ల మనీలాండరింగ్ కేసు (Money Laundering case) దర్యాప్తులో సినీ నటుడు మహేష్ బాబు(Maheshbabu)కు ఈడీ (ED) సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, మహేష్ బాబు తాజా లేఖ ద్వారా విచారణ తేదీలో మార్పు కోరారు. ప్రస్తుతం చిత్రీకరణ పనుల్లో బిజీగా ఉండటంతో ఈరోజు, రేపు విచారణకు హాజరుకావడం సాధ్యపడదని మహేష్ తన లేఖలో తెలిపారు.

Jack Fruit: పనసపండ్లు తొనలు ప్రతీ రోజు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా!

ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో ఓ భారీ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. ఈ కారణంగా ఇప్పుడు విచారణకు హాజరు కావడం కష్టమని పేర్కొంటూ, ఈడీ అధికారులకు మరో అనుకూలమైన తేదీ ఇవ్వాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. మహేష్ బాబు లేఖను పరిశీలించిన అధికారులు, తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విచారణను వాయిదా వేసే అవకాశమూ ఉందని వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఈడీ విచారణపై అధికార వర్గాలు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఈ మనీలాండరింగ్ కేసులో ఇంకా పలు ప్రముఖుల పేర్లు బయటకు రావచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు పరిణామాలపై తెలుగు చిత్రపరిశ్రమలో ఉత్కంఠ నెలకొంది.