Site icon HashtagU Telugu

Pic Talk: క్రేజీ ఆప్డేట్.. మహేశ్ బాబుతో రాజమౌళి!

Rajamouli

Rajamouli

ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి జర్నీ ముగిసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించడంతో పాటు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక జక్కన తన నెక్ట్స్ ప్రాజెక్టుపై ఫోకస్ చేస్తున్నాడు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ తమ తదుపరి సినిమా ఆఫ్రికాలో ఇండియానా జోన్స్ స్టైల్ అడ్వెంచర్ అని తరచుగా చెబుతుండగా..  ఈ చిత్రం గురించి ఇతర వివరాలు ఏవీ కూడా బయటకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రాజమౌళి ప్రిన్స్ మహేశ్ బాబుతో కలిసిన ఫొటో ఒకటి వైరల్ గా మారుతోంది. ఈ చిత్రంలో నిర్మాత కెఎల్ నారాయణను కూడా ఉన్నాడు.

అయితే రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఆయన తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించేందుకు కొంత విరామం తీసుకోవాలని భావిస్తున్నారు. కాగా మహేష్ బాబు చేతిలో రెండు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. రాజమౌళి సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి కొంత సమయం పట్టొచ్చు. కీర్తి సురేష్ కథానాయికగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో సర్కారు వారి పాటతో బిజీగా ఉన్నాడు మహేశ్. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మే 12న విడుదల కానుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version