Site icon HashtagU Telugu

Gautam and Sitara: తాతకు వీడ్కోలు చెప్పిన సితార, గౌతమ్.. నివాళులర్పిస్తూ ఎమోషన్!

Sitara1

Sitara1

సూపర్ స్టార్ కృష్ణ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ అంత్యక్రియలు ఈరోజు మహాప్రస్థానంలో జరగనున్నాయి. అంత్యక్రియలకు ముందు మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ పిల్లలు, గౌతమ్, సితార తమ తాతకృష్ణకు నివాళులర్పించారు. నమ్రత, మహేష్ బాబు తమ పిల్లలతో కలిసి వచ్చారు. చివరిసారిగా తాతను చూసి ఎమోషన్ అయ్యారు గౌతమ్, సితార.

మరికొద్ది గంటల్లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని నివాళులర్పించేందుకు హైదరాబాద్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు లెజెండ్‌కు నివాళులర్పించారు. కృష్ణ భౌతికకాయాన్ని ప్రజల నివాళులర్పించేందుకు పద్మాలయా స్టూడియోస్‌లో ఉంచారు.