Site icon HashtagU Telugu

Mahesh Babu : అదరగొడుతున్న మహేశ్ బాబు SSMB28 ఫస్ట్ లుక్

Mahesh

Mahesh

SSMB28నుంచి మహేశ్ బాబు (Mahesh Babu) ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఈ లుక్ చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్, సినీ లవర్స్ నుంచి అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్టర్ కు అన్ని వైపుల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయి. ఈ మూవీ అభిమానుల అంచనాలను ఖచ్చితంగా పెంచేలా ఉందంటున్నారు.

కాగా ఈ పోస్టర్ నుంచి మరో భారీ అప్డేట్ ఏంటేంటే మూవీ విడుదల తేదీని ప్రకటించారు. ముందుగా ఉహించినట్లుగానే ఆగస్టు 2023లో కాకుండా జనవరి 13, 2024న విడుదల కానుంది. ఇన్‌స్టాగ్రామ్‌ లో మహేష్ బాబు ఈ మూవీ గురించి ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేస్తూ, “13.01.2024!! #SaveTheDate” అని రాశారు.

ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు తన అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మాస్ అవతార్ లో కనిపించాడు. ధూళి, మసాలా దినుసల మధ్య నడుస్తూ స్టైల్ గా స్మోకింగ్ చేస్తున్నాడు. కొన్నాళ్లుగా స్క్రీన్ బీ పై స్మోకింగ్ కు దూరంగా ఉన్న మహేశ్ బాబు..ఇప్పుడు తన కెరీర్ లో బెస్ట్ ఫస్ట్ లుక్స్ ను ఇవ్వడం ద్వారా మళ్లీ ట్రెండ్ ను బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. పోస్టర్ లో మహేశ్ లుక్స్ ఆశ్చర్యం కలిగించాయి. కాగా ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ మహేశ్ తో జతకడుతోంది.