SSMB29 Big Update: మహేశ్ ప్యాన్స్ కు రాజమౌళి గుడ్ న్యూస్, బర్త్ డేకు అదిరిపొయే అనౌన్స్ మెంట్

SSMB29 నిర్మాతలు ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజున గ్రాండ్ అనౌన్స్‌మెంట్ చేయడానికి సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Maheshbabu

Maheshbabu

సూపర్‌స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ ఫిల్మ్ మేకర్ SS రాజమౌళి కాంబినేషన్ లో SSMB29 రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గత సంవత్సరం ప్రకటించినప్పటి నుండి చర్చనీయాంశమైంది. ఈ మూవీ నుంచి ఏదైనా అప్టేడ్ ఉంటుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు బర్త్ డే దగ్గర పడుతుండటంతో రాజమౌళి ఏం ప్లాన్ చేస్తాడు అనేది అందరిలో ఆసక్తి నెలకొంది.

తాజా సమాచారం ప్రకారం.. SSMB29 నిర్మాతలు ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజున గ్రాండ్ అనౌన్స్‌మెంట్ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. సూపర్‌స్టార్ ఎప్పటికీ చూడని కాన్సెప్ట్‌ను అందిస్తూ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. సాధారణంగా రాజమౌళి తన నటీనటుల పుట్టినరోజుల కోసం ప్రత్యేకంగా ఏదైనా ప్లాన్ చేస్తాడు ఈ క్రియేటివ్ మేధావి. మరి ఈ స్టార్ డైరెక్టర్ సూపర్ స్టార్ మహేశ్ కోసం ఏమి అందిస్తాడో అని మహేష్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

హనుమంతుని నుంచి ప్రేరణ పొందిన కథతో మహేష్ బాబు పాత్ర ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. సినిమా స్క్రీన్ రైటర్, KV విజయేంద్ర ప్రసాద్, SSMB29 RRR కంటే పెద్దగా ఉంటుందని ఇప్పటికే హింట్ ఇచ్చారు. ప్రాజెక్ట్ యాక్షన్, థ్రిల్స్ , డ్రామాతో నిండిన గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్ గా తెరకెక్కతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ కావడంతో, భారతీయ చలనచిత్ర పరిశ్రమ, హాలీవుడ్‌లోని అత్యుత్తమ ప్రతిభావంతులతో కలిసి పనిచేయడానికి దర్శకుడు బిగ్ ప్లాన్‌లో ఉన్నాడు. మహిళా ప్రధాన పాత్ర విషయానికొస్తే ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ దీపికా నటించే అవకాశాలున్నాయి.

Also Read: Jupally Krishna Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జూపల్లి, కేసీఆర్ పై ఘాటు విమర్శలు

  Last Updated: 03 Aug 2023, 01:18 PM IST