Mahesh Babu: మహేష్ బాబుతో అర్జున్ రెడ్డి డైరెక్టర్ మూవీ.. స్టోరీ లైన్ ఇదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో మహేష్ బాబు (Mahesh Babu) అని అందరికీ తెలుసు.

Published By: HashtagU Telugu Desk
Mahesh Babu

Compressjpeg.online 1280x720 Image (2) 11zon

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో మహేష్ బాబు (Mahesh Babu) అని అందరికీ తెలుసు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వరుస బ్లాక్ బస్టర్లు సాధిస్తూ తనకు తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు మహేష్ బాబు. అయితే సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ఇప్పుడు వరకు ఏ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాలేదు. త్రివిక్రమ్ తో ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్నాడు. కానీ ఆ సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతోంది.

అయితే త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇక అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు మహేష్ బాబు. ఈ క్రమంలోనే క్యూట్ గా కనిపించే మహేష్ బాబును సందీప్ రెడ్డి వంగ ఎలా చూపించబోతున్నాడు అన్నదానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు వరకు ఎప్పుడు చూడని రీతిలో మహేష్ ను కొత్తగా చూపించబోతున్నాడట సందీప్ రెడ్డి.

Also Read: Jagan Vote for Note : `కాపునేస్తం`లో చంద్ర‌బాబు జైలు!!

మహేష్ బాబు కోసం డైరెక్టర్ సందీప్ రెడ్డి (Sandeep Reddy) ఓ సరికొత్త కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. అండర్ వరల్డ్ డాన్ గా నెగిటివ్ షేడ్ ఉండే కథ మహేష్ కు నచ్చిందని డైరెక్టర్ సందీప్ తాజాగా ఓ కార్యక్రమంలో చెప్పాడు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం మూవీ చేస్తున్నాడు. ఆ తరువాత రాజమౌళితో సినిమా చేయనున్నారు. దింతో సందీప్ తో మూడేళ్ళ తర్వాత ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉందని సమాచారం. గుంటూరు కారం సినిమా ముగిసిన వెంటనే రాజమౌళి సినిమాతో బిజీ అవ్వబోతున్నాడు మహేష్ బాబు. రాజమౌళి ఇంకా స్క్రిప్ట్ పూర్తి చేయని నేపథ్యంలో గుంటూరు కారం ముగిసిన వెంటనే గ్యాప్ లో మరో సినిమా చేయాలని మహేష్ అనుకుంటున్నాడు అంటూ టాక్ కూడా వినిపిస్తోంది.

  Last Updated: 16 Sep 2023, 02:14 PM IST