Site icon HashtagU Telugu

Mahesh Babu : ‘ముఫాస-ది లయన్ కింగ్’ కోసం మహేష్ బాబు మాట సాయం..!

Mahesh Leaked Look

Mahesh Leaked Look

Mahesh Babu : హాలీవుడ్ లోని పలు యానిమేటెడ్ మూవీస్‌ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంటాయి. వాటిలో ప్రథమైనది ‘ది లయన్ కింగ్’ అని చెప్పవచ్చు. అడివికి రాజు అయిన సింహం ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం చిన్న పిల్లల మనసు దోచుకుంది. 2019లో రిలీజ్ అయిన ‘ది లయన్ కింగ్’ వరల్డ్ వైడ్ గా రూ.166 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అదుర్స్ అనిపించింది. హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు లభించే ప్రేక్షాదరణ.. ఈ యానిమేటెడ్ మూవీకి కూడా లభించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

దీంతో ఈ మూవీకి కొనసాగింపుగా మరో సినిమాని తీసుకు రావాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే లయన్ కింగ్‌కి ప్రీక్వెల్ గా ‘ముఫాస’ అనే సినిమా తీసుకు రాబోతున్నారు. లయన్ కింగ్ సినిమాలోని సింబా తండ్రి అయిన ముఫాస కథతో ఈ సీక్వెల్ ఉండబోతుంది. ఈ డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే టీజర్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకున్నాయి. దీంతో ఆడియన్స్ అంతా ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. కాగా తెలుగులో ఈ మూవీని రిలీజ్ చేసే నిర్మాతలు ఈ సినిమాకి మరింత పాపులారిటీని తీసుకు రావడం కోసం మహేష్ బాబుని కూడా ఇందులో భాగం చేయాలని చూస్తున్నారట.

ముఫాస సినిమాకి మహేష్ బాబుతో వాయిస్ ఓవర్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. మరి మహేష్ బాబు ఇందుకు ఓకే చెబుతారా లేదా చూడాలి. కాగా మహేష్ బాబు గతంలో జల్సా, బాద్‌షా, ఆచార్య వంటి పలు తెలుగు సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. హాలీవుడ్ సినిమాలకు అయితే ఇప్పటివరకు ఏ చిత్రానికి డబ్బింగ్ చెప్పలేదు.