Site icon HashtagU Telugu

Mahesh Babu : అభిమానులతో కలిసి సినిమా చూసిన మహేష్.. సుదర్శన్ థియేటర్లో ఫ్యామిలీతో బాబు..

Mahesh Babu Watched Guntur Kaaram Movie with Family in Sudarshan Theater

Mahesh Babu Watched Guntur Kaaram Movie with Family in Sudarshan Theater

మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది. త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తల్లి సెంటిమెంట్ తో పాటు మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా చేయగా, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, జయరాం, ప్రకాష్ రాజ్, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్.. పలువురు ముఖ్య పాత్రలు చేశారు. గుంటూరు కారం నుంచి వచ్చిన ట్రైలర్, కుర్చీ మడతపెట్టి సాంగ్స్ తో సినిమాపై మంచి అంచనాలే క్రియేట్ చేశారు.

నిన్న అర్ధరాత్రి నుంచే పలు చోట్ల గుంటూరు కారం సినిమా ప్రీమియర్ షోలు వేశారు. దీంతో అభిమానులు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. ఇక ఎప్పటిలాగే అభిమానులు RTC X రోడ్స్ లో థియేటర్స్ వద్ద హంగామా చేస్తున్నారు. అప్పుడప్పుడు అక్కడ ఉన్న సుదర్శన్ లేదా సంధ్య థియేటర్స్ లో మన స్టార్స్ కూడా రిలీజ్ రోజు వెళ్లి అభిమానులతో కలిసి సినిమా చూసి సందడి చేస్తారు. మహేష్ సాధారణంగా బయటకి రారు. అందులోను ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేసెస్ లోకి రారు. కానీ ఈ సారి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సుదర్శన్ థియేటర్ కి మహేష్ ఫ్యామిలీ, త్రివిక్రమ్ తో కలిసి వచ్చారు.

మహేష్ బాబు, త్రివిక్రమ్, నమ్రత, సితార, గౌతమ్.. పలువురు కలిసి సుదర్శన్ థియేటర్ కి ఇవాళ మార్నింగ్ షో అభిమానులతో కలిసి చూడటానికి వచ్చారు. థియేటర్స్ లో అభిమానుల సందడి మధ్య మహేష్ తన గుంటూరు కారం సినిమాని వారితో కలిసి చూశారు. దీంతో మహేష్ థియేటర్ కి వచ్చిన విజువల్స్, హాల్ లో కూర్చొని సినిమా చూస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాబు ఇలా ఫుల్ క్రౌడ్ ఉండే ప్లేస్ కి వచ్చి అభిమానులతో కలిసి సినిమా చూడటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read : Miss Perfect : పెళ్లి తర్వాత లావణ్య ఫస్ట్ వెబ్ సిరీస్.. ‘మిస్ పర్ఫెక్ట్’ టీజర్ చూశారా?