Site icon HashtagU Telugu

Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’కి మహేష్ బాబు వాయిస్ ఓవర్..?

Mahesh Babu Voice Over For Prabhas Kalki 2898 Ad Movie

Mahesh Babu Voice Over For Prabhas Kalki 2898 Ad Movie

Kalki 2898 AD : ప్రభాస్ మెయిన్ లీడ్ లో భారీ తారాగణంతో దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘కల్కి 2898 AD’. హాలీవుడ్ మూవీస్ తరహాలో ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ లో రిలీజ్ కి సిద్దమవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ కాన్సెప్ట్ అండ్ కాస్టింగ్ తో ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా వినిపిస్తున్న వార్తతో ఆ అంచనాలు ఆకాశాన్ని అందేలా ఉన్నాయి.

ఇంతకీ ఆ వార్త ఏంటంటే.. ఈ సినిమా కోసం మహేష్ బాబు తన గొంతుని అరువు ఇవ్వబోతున్నారట. ఈ మూవీలో ప్రభాస్.. శ్రీమహావిష్ణు దశావతారం అయిన కల్కిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ప్రభాస్ ని విష్ణు అవతారంలో పరిచయం చేయడం కోసం మహేష్ బాబుతో వాయిస్ ఓవర్ చెప్పించాలని ప్రయత్నిస్తున్నారట. ఇందుకోసం ఆల్రెడీ నాగ్ అశ్విన్ అండ్ టీం.. మహేష్ బాబుని సంప్రదించినట్లు సమాచారం. తెలుగులో మహేష్ తో చెప్పించినట్లు.. ఇతర భాషల్లో అక్కడి స్టార్ హీరోలతో చెప్పించే ప్రయత్నం కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది.

ఈ వార్తతో ఆడియన్స్ లో మూవీ పై మరింత క్రేజ్ క్రియేట్ అవుతుంది. కాగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని తదితర స్టార్ కాస్ట్ నటిస్తుంది. అలాగే మరికొంత సర్‌ప్రైజింగ్ స్టార్ కాస్ట్ కూడా మూవీలో కనిపించబోతుందట. ఆ సర్‌ప్రైజ్ లు తెలియాలంటే.. జూన్ 27 వరకు ఎదురు చూడాల్సిందే. కాగా ఈ మూవీని సి అశ్వినీదత్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Also read : Pawan Kalyan : పవన్ కోసం కదిలొస్తున్న టాలీవుడ్.. మెల్లిగా అందరూ బయటకి వచ్చేస్తున్నారుగా..