Site icon HashtagU Telugu

Guntur Kaaram Trailer : గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్.. సంక్రాంతికి ఘాటెక్కిస్తున్న బాబు..

Mahesh Babu Trivikram Sreeleela Guntur Kaaram Trailer Released

Mahesh Babu Trivikram Sreeleela Guntur Kaaram Trailer Released

త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా వీరి కాంబోలో మూడోసారి రాబోతున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి గ్లింప్స్, మూడు పాటలు రిలీజ్ చేయగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గుంటూరు కారం సినిమాని జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

అయితే గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ మాత్రం చెయ్యట్లేదు. ఇప్పటి వరకు టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ అనౌన్స్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేశారు. దీంతో మహేష్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే తాజాగా నేడు గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. సాయంత్రం రిలీజ్ చేస్తారు అనుకున్నారు. సుదర్శన్ థియేటర్లో అభిమానుల కోసం ట్రైలర్ స్పెషల్ షో వేస్తామని ప్రకటించారు. దీంతో అభిమానులు సుదర్శన్ థియేటర్ వద్ద బ్యానర్స్ కట్టి DJ పెట్టి హంగామా చేశారు.

అయితే ట్రైలర్ ని రాత్రి 9 గంటలకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్రయూనిట్. దీంతో సుదర్శన్ థియేటర్ వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఎలాగైతేనేం మొత్తానికి గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది.

ఇక ట్రైలర్ లో ఎక్కువ మాస్ అంశాలతో పాటు లవ్, ఫ్యామిలీ సీన్స్ కూడా ఉండేలా పెట్టారు. అయితే కథ ఏంటి అనేది ట్రైలర్ లో తెలియకుండా జాగ్రత్తపడ్డారు. మహేష్ మాత్రం గుంటూరు కారం ఘాటులా యాక్షన్ అదరగొట్టేసాడు.