Site icon HashtagU Telugu

Mahesh Babu : గురూజీలో ఇంత మాస్ యాంగిల్ ఎవరు ఊహించలేదే..!

Mahesh Babu Trivikram Reasone For Guntur Karam Kurchi Madatapetti Song

Mahesh Babu Trivikram Reasone For Guntur Karam Kurchi Madatapetti Song

Mahesh Babu త్రివిక్రం అంటే క్లాస్ డైరెక్టర్ ఆయన డైలాగ్స్ తో ఆడియన్స్ మనసులు గెలుస్తాడని తెలిసిందే. నువ్వే నువ్వే సినిమా నుంచి అల వైకుంఠపురంలో వరకు త్రివిక్రం సినిమా అంటే చాలు కథ కథనాలు ఎలా ఉన్నా హృదయానికి హత్తుకునే మాటలు ఉంటాయని చెప్పొచ్చు. అల్లు అర్జున్ వైకుంఠపురములో సినిమా తర్వాత 3 ఏళ్ల గ్యాప్ తో గుంటూరు కారం సినిమాతో వస్తున్నాడు త్రివిక్రం. మహేష్ తో అతడు ఖలేజా సినిమాలు చేసిన త్రివిక్రం గుంటూరు కారం తో హ్యాట్రిక్ మూవీ చేశాడు.

We’re now on WhatsApp : Click to Join

ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటించింది. సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ అన్నీ కూడా సినిమాపై క్రేజ్ తీసుకు రాగా కుర్చీ మడతపెట్టి సాంగ్ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. మహేష్ లాంటి హీరోతో కుర్చీ మడతపెట్టి అనే మాస్ సాంగ్ చేయడం మామూలు విషయం కాదు.

అయితే ఈ సాంగ్ ఎంపిక ఎవరన్నది మహేష్ గుంటూరు కారం ప్రీ రిలీజ్ స్టేజ్ మీద చెప్పారు. కుర్చీ మడతపెట్టి సాంగ్ త్రివిక్రం ఐడియా అని మహేష్ అన్నారు. ఆయనే ఇలా ఒక సాంగ్ ఉండాలని అన్నారు. అయితే ఆ ఐడియాని థమన్ వెంటనే ఓకే చేశారు. వేరే మ్యూజిక్ డైరెక్టర్ అయితే దానికి చాలా డిస్కషన్స్ చేసే వారు కానీ థమన్ వెంటనే ఓకే చెప్పాడని అన్నారు మహేష్.

మహేష్ చెప్పిన దాని ప్రకారం చూస్తే గురూజీ ఆ సాంగ్ చేయించాడన్నమాట. పైకి చాలా సాఫ్ట్ గా కనిపించే త్రివిక్రం లో ఇంత మాస్ యాంగిల్ ఉందా అని ఆడియన్స్ షాక్ అవుతున్నారు. గుంటూరు కారం సినిమాలో మహేష్ ఊర మాస్ యాటిట్యూడ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెడుతుందని మేకర్స్ చెబుతున్నారు. సినిమా ప్రచార చిత్రాలు కూడా వాటికి తగినట్టుగానే ఉన్నాయి. మరి గుంటూరు కారం ఆశించిన అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఈ సంక్రాంతికి గట్టిగా కొడుతున్నామని మహేష్ చెప్పడం ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది.

Also Read : Rajinikanth: రజినీకాంత్ లాల్ సలామ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

కచ్చితంగా మహేష్ మార్క్ సంక్రాంతి హిట్ గా గుంటూరు కారం ఉంటుందా లేదా అన్నది చూడాలి. జనవరి 12న సంక్రాంతి పండుగ ఫీవర్ తెచ్చేలా సూపర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా కనిపిస్తుంది. మరి ఈ ఉత్సాహం సినిమా రిలీజ్ అయ్యాక డబుల్ అవుతుందా లేదా అన్నది చూడాలి.