Site icon HashtagU Telugu

Guntur Kaaram : గుంటూరు కారం.. మహేష్ బాబు బర్త్‌డే స్పెషల్ పోస్టర్.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ..

Mahesh Babu Trivikram Guntur Kaaram Movie Update

Mahesh Babu Trivikram Guntur Kaaram Movie Update

మహేష్ బాబు (Mahesh Babu) త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్ లో రాబోతున్న గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా ఇటీవల బాగా వార్తల్లో నిలుస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా కావడంతో ముందు నుంచి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు కూడా పెంచారు.

కానీ గుంటూరు కారం సినిమా షూటింగ్ ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడింది. సినిమా నుంచి పూజాహెగ్డే తప్పుకుంది. కొంతమంది ఆర్టిస్టులు కూడా తప్పుకున్నారని సమాచారం. ఇక మహేష్ టైం దొరికినప్పుడల్లా ఫారిన్ కి వెళ్తుండటంతో సినిమా షూట్ సాగట్లేదు. దీంతో గుంటూరు కారం సినిమాపై, చిత్రయూనిట్ పై విమర్శలు వస్తున్నాయి.

తాజాగా నేడు మహేష్ బాబు పుట్టిన రోజు కావడంతో గుంటూరు కారం నుంచి మహేష్ బాబు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. తెల్లవారుజామున 12 గంటల 6 నిమిషాలకు మహేష్ బాబుకి బర్త్ డే విషెష్ చెప్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్లో మహేష్ లుంగీ కట్టి, బీడీ కాలుస్తూ కళ్ళజోడు పెట్టి మాస్ లుక్ లో ఉన్నాడు. అలాగే సినిమా రిలీజ్ పై వస్తున్న వార్తలకు కూడా కౌంటర్ ఇస్తూ గుంటూరు కారం సినిమాని వచ్చే సంక్రాంతికే 12 జనవరి 2024న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అభిమానులు, పలువురు ప్రముఖులు మహేష్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

Also Read : Tamanna : హీరోయిన్ గా ఛాన్సులు రావనే ఉద్దేశ్యంతో..ఆ పనికి ఒప్పుకున్నా – తమన్నా