Site icon HashtagU Telugu

Mahesh Babu : మొత్తానికి రాజమౌళి దగ్గర్నుంచి పాస్ పోర్ట్ లాక్కున్న మహేష్ బాబు.. షూటింగ్ కి బ్రేక్.. వెకేషన్ కి జంప్..

Mahesh Babu Take Passport from Rajamouli went to Vacation

Mahesh Babu

Mahesh Babu : మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్ కి కావాల్సిన సెట్ హైదరాబాద్ లో తయారుచేస్తున్నారు. అయితే మహేష్ బాబు గ్యాప్ దొరికితే విదేశాలకు వెకేషన్ కి వెళ్ళిపోతారు.

కానీ రాజమౌళి సినిమా మొదలయ్యే ముందు మహేష్ బాబు పాస్ పోర్ట్ లాగేసుకున్నాను అని ఒక పోస్ట్ పెట్టారు. సినిమా అయ్యేవరకు మహేష్ ఏ వెకేషన్ కి వెళ్ళలేడు అని రాజమౌళి ఇన్ డైరెక్ట్ గా ఓ పోస్ట్ తో చెప్పాడు. ఫ్యాన్స్ కూడా అదే భావించారు. సాధారణంగా రాజమౌళి సినిమా అంటే హీరోలు రాజమౌళి చెప్పినట్లు ఉండాల్సిందే. కానీ మహేష్ సినిమాకి అవన్నీ మారాయి. మహేష్ తనకు నచ్చినట్టు యాడ్స్ చేస్తున్నాడు, బయట తిరుగుతున్నాడు.

ఇప్పుడు మహేష్ బాబు వెకేషన్ కి కూడా వెళ్తున్నాడు. నేడు మహేష్ బాబు ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. అక్కడ ఉండే కెమెరామెన్స్ ఫోటోలు తీస్తుంటే వాళ్ళకి మహేష్ తన పాస్ పోర్ట్ చూపించాడు. దీంతో రాజమౌళి దగ్గర్నుంచి మహేష్ బాబు పాస్ పోర్ట్ తీసుకున్నాడు, వెకేషన్ కి వెళ్లిపోయాడని తెలుస్తుంది. మహేష్ ఫ్యామిలీతో కలిసే వెకేషన్ కి వెళ్లినట్టు తెలుస్తుంది.

నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలయ్యే లోపు ఓ వెకేషన్ కి వెళ్ళొద్దామని మహేష్ వెళ్ళిపోయాడు. అయితే ఏ హీరోకి సాధ్యం కానివి అన్ని రాజమౌళి దగ్గర మహేష్ బాబుకి సాధ్యం అవుతుండటం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం మహేష్ పాస్ పోర్ట్ చూపించిన వీడియోలు వైరల్ గా మారాయి.

 

Also Read : NTR – Nelson : తమిళ్ స్టార్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా.. సక్సెస్ ఈవెంట్లో క్లారిటీ ఇచ్చేసిన ఎన్టీఆర్..