Site icon HashtagU Telugu

Mahesh Babu : అఖిల్ రిసెప్షన్ వేడుకలో అందరి చూపు మహేష్ టీ-షర్ట్ పైనే..దాని ధర తెలిస్తే షాకే !

Mahesh Tshirt

Mahesh Tshirt

అక్కినేని అఖిల్ (Akhil) ఓ ఇంటివాడు అయ్యాడు. తన ప్రేమికురాలు, నటి జైనబ్ రవ్ డ్జీ(Zainab )ని జూన్ 6వ తేదీన ఉదయం 3 గంటలకు వివాహబంధం(Wedding)తో ఒక్కటయ్యారు. ఈ వివాహం అఖిల్ నివాసంలో కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరగగా, అదే రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్‌ స్టార్‌లు తమ కుటుంబాలతో హాజరై వేడుకలో సందడి చేసారు.

CM Revanth Reddy : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..శాఖల కేటాయింపుపై చర్చ..!

ఇక ఈ రిసెప్షన్‌ వేడుకలో మహేష్ బాబు ఫ్యామిలీ (Mahesh babu ) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా మహేష్ కూతురు సితార (Sithara) పింక్ లెహంగాలో అందరినీ ఆకట్టుకోగా, మహేష్ బాబు ధరించిన టీ షర్ట్‌(Mahesh Babu T Shirt)పై అందరి దృష్టి పడింది. ఆయన వేసుకున్న టీ షర్ట్ Mightychic బ్రాండ్‌కి చెందిన Hermes Men Puzzle Floral Sweater అని తెలుస్తుంది. దీని ధర అక్షరాలా 1,54,873 రూపాయలు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. “సూపర్‌స్టార్ రేంజ్ అంటే ఇదే” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Bhatti Vikramarka : హోంమంత్రిగా భట్టి విక్రమార్క?

మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకధీరుడు రాజమౌళితో కలిసి “ఎస్‌.ఎస్‌.ఎం‌.బి 29” అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ పాన్-ఇండియా సినిమా చేస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా, విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఆర్ మాధవన్ కూడా ఇందులో భాగమవుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి సినిమాల పరంగానే కాదు బయట కూడా మహేష్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.