Site icon HashtagU Telugu

Mahesh Babu : తండ్రి జ్ఞాపకార్థం మరో కొత్త సేవా కార్యక్రమం మొదలుపెట్టిన మహేష్ బాబు..

Mahesh Babu started one more Service to Poor People on his Father Krishna First Remembrance Day

Mahesh Babu started one more Service to Poor People on his Father Krishna First Remembrance Day

హీరో మహేష్ బాబు(Mahesh Babu) సినిమాలతో ప్రేక్షకులని మెప్పించడమే కాక తన సేవాగుణంతో ఎంతోమంది చిన్నారులకు ప్రాణాలు పోసి నిజమైన హీరో అనిపించుకున్నారు. మహేష్ బాబు గతంలోనే మహేష్ బాబు ఫౌండేషన్(Mahesh Babu Foundation) స్థాపించి గుండె సమస్యలతో బాధపడుతున్న పేద పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 1000 కి పైగా పిల్లలకు మహేష్ తన ఫౌండేషన్ ద్వారానే చికిత్సకు కావాల్సినవి అన్ని ఏర్పాటు చేశారు.

ఇదే కాకుండా తన తండ్రి పుట్టిన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలని, అభివృద్ధి పనులని నిర్వహిస్తున్నారు. ఇలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహేష్ బాబు తాజాగా మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

సూపర్ స్టార్ కృష్ణ(Super Star Krishna) గత సంవత్సరం నవంబర్ 15న మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణ మరణంతో ఘట్టమనేని కుటుంబంలో, టాలీవుడ్ లో, అభిమానుల్లో విషాదం నెలకొంది. నిన్నటికి ఆయన మరణించి సంవత్సరం అయింది. నిన్న ఘట్టమనేని కుటుంబం కృష్ణ మొదటి వర్థంతిని(First Remembrance Day) హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ స్మారక దినంకు ఘట్టమనేని కుటుంబంతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా వచ్చి కృష్ణకు నివాళులు అర్పించారు.

ఈ నేపథ్యంలో తన తండ్రి జ్ఞాపకార్థం మహేష్ మరో నిర్ణయం తీసుకున్నారు. పేద విద్యార్థులకు అండగా ఉండేందుకు ‘సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్’ని మొదలుపెట్టారు. దీంతో 40 మందికి పైగా పేద విద్యార్థులను ఎంపిక చేసి వారికి పాఠశాల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వారి చదువుకు కావాల్సిన మొత్తాన్ని స్కాలర్ షిప్ ద్వారా అందించనున్నట్టు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. దీంతో మరోసారి మహేష్ పై అభిమానులు, నెటిజన్లు అభినందనలు కురిపిస్తున్నారు.

 

Also Read : Krishna : కృష్ణ మొదటి వర్థంతి.. నివాళులు అర్పించిన ఘట్టమనేని కుటుంబం, సినీ ప్రముఖులు..