Site icon HashtagU Telugu

Guntur Kaaram : యావరేజ్ సినిమాతో చిరు హిట్ బొమ్మని క్రాస్ చేసేసిన మహేష్..

Mahesh Babu Sreeleela Guntur Kaaram Got Highest Trp In Television

Mahesh Babu Sreeleela Guntur Kaaram Got Highest Trp In Television

Guntur Kaaram : త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూడో సినిమా ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ నటించిన ఈ చిత్రం రిలీజ్ కి ముందు భారీ హైప్ ని క్రియేట్ చేసుకుంది. కానీ రిలీజ్ తరువాత ఆడియన్స్ అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద సోసోగా నడిచింది. ఇక థియేటర్స్ నుంచి ఓటీటీకి వచ్చిన ఈ చిత్రం.. ఓటీటీలో మంచి రెస్పాన్స్‌ని అందుకుంది.

ఇక తాజాగా ఈ చిత్రం టెలివిజన్ లోకి కూడా వచ్చేసింది. జెమినీ టీవీలో ఈ సినిమా గత ఆదివారం ప్రసారం అయ్యింది. ఓటీటీ మాదిరిగానే ఈ సినిమాకి టెలివిజన్ లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. గుంటూరు కారం ప్రసారం అయిన నాడు.. జెమినీ టీవీకి 9.23 టీఆర్పీ నమోదు అయ్యింది. జెమినీ టీవిలో ఈమధ్య కాలంలో ప్రసారమైన సినిమాల్లో ఇదే టాప్ టీఆర్పీ. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ 7.69 టీఆర్పీని అందుకుంటే, రజిని ‘జైలర్’ 6.30 టీఆర్పీ నమోదు చేసింది.

ఆ తరువాత సార్ 5.89, వాల్తేరు వీరయ్య 5.14, దసరా 4.99, హాయ్ నాన్న 4.45, హిట్ 2 3.69, లియో 3.00 టీఆర్పీని నమోదు చేసాయి. గుంటూరు కారం వంటి యావరేజ్ సినిమాతో చిరంజీవి అండ్ రజినీకాంత్ హిట్ మూవీస్ ని మహేష్ బాబు క్రాస్ చేసేసారు. కాగా గతంలో జెమినీ టీవిలో మహేష్ బాబు మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలు ప్రసారం అవ్వగా.. మహర్షి 9.20, సరిలేరు నీకెవ్వరు 23.40 టీఆర్పీని నమోదు చేసాయి. ఇలా జెమినీ టీవిలో టాప్ లో ఉన్న టీఆర్పీ మూవీస్ మహేష్‌వి కావడం విశేషం.

Also read : Mrunal Thakur : జిమ్‌ వర్క్ అవుట్స్‌ని కూడా.. మృణాల్ ఎంత క్యూట్‌గా చేస్తుందో చూశారా..?