Site icon HashtagU Telugu

Mahesh Babu: అభిమానుల కోసం మ‌హేష్ బాబు ప్ర‌త్యేక వీడియో.. ఏమ‌న్నారంటే?!

Mahesh Babu

Mahesh Babu

Mahesh Babu: సూపర్‌స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) తన రాబోయే సినిమా ఈవెంట్‌కు హాజరయ్యే అభిమానుల కోసం భద్రత, రవాణా, ప్రవేశ నిబంధనలకు సంబంధించి ముఖ్యమైన సూచనలను జారీ చేశారు. ముఖ్యంగా ఈవెంట్‌కు హాజరయ్యే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని నియమాలను ఆయన ప్రత్యేకంగా నొక్కి చెప్పారు.

ప్రవేశ నియమాలు, QR కోడ్ తప్పనిసరి

మహేశ్ బాబు అభిమానులకు ముందుగా చెప్పిన ముఖ్య విషయం ఏమిటంటే.. ఈవెంట్ జరుగుతున్న వేదిక రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్లు మూసివేసి ఉంటాయని తెలిపారు. అలాగే ఈవెంట్‌కు రావడానికి తమ వద్ద పాస్‌లు ఉంటేనే రావాలని విజ్ఞప్తి చేశారు. పాస్ లేని వారు వచ్చి ఇబ్బంది పడొద్దని సూచించారు. అభిమానులకు ఇచ్చిన పాస్‌లో QR కోడ్ ఉంటుందని, దాన్ని స్కాన్ చేస్తే వారికి కేటాయించిన ప్రవేశ ద్వారం చూపుతుందని వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ నిర్దేశిత ప్రవేశ ద్వారాల వద్ద మాత్రమే రావాలని కోరారు. ఈవెంట్‌కు సంబంధించిన పాస్‌పోర్ట్‌లు లేకుండా కంగారుపడి వచ్చేయకండి అని ఆయన స్పష్టం చేశారు.

Also Read: Jubilee Hills Bypoll Counting : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ ఆధిక్యం దిశగా కాంగ్రెస్

పోలీస్ & సిబ్బందికి సహకరించండి

భద్రతా సిబ్బంది, ఆన్-గ్రౌండ్ స్టాఫ్‌కు సహకరించాలని మహేశ్ బాబు కోరారు. “ప్రతి ఒక్కరూ ఇన్స్ట్రక్షన్స్ పాటించండి. పోలీస్ వాళ్ళకి, ఆన్ గ్రౌండ్ స్టాఫ్‌కి సపోర్ట్ చేయండి” అని విజ్ఞప్తి చేశారు. “మనం అంతా ఒక ప్రత్యేకమైన ఈవెంట్ కోసం ఒకచోట చేరుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, సులభతరమైన వాతావరణాన్ని కల్పిద్దాం” అని మహేశ్ బాబు పిలుపునిచ్చారు. మహేశ్ బాబు తన సందేశాన్ని ముగిస్తూ అభిమానులకు మరిన్ని ప్రకటనలు ఉంటాయని తెలిపారు. “మనకి ఇంకా చాలా అనౌన్స్‌మెంట్స్ ఉంటూనే ఉంటాయి. రేపు సాయంత్రం కలుద్దాం” అని పేర్కొన్నారు. ఇక‌పోతే రేపు ఎస్ఎస్ఎంబీ 29 మూవీ నుంచి మ‌హేష్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

Exit mobile version