Mahesh Babu on SSR: ఆయన డైరెక్షన్ అంటే.. ఒకేసారి 25 మూవీస్‌ చేసినట్టు : మహేష్ బాబు

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్ అంటే మాటలా! వీరిద్దరూ కలిసి ఒక మూవీ తీస్తున్నారంటే అంచనాలు అమాంతం పెరిగిపోతాయి.

  • Written By:
  • Publish Date - August 9, 2022 / 07:30 AM IST

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్ అంటే మాటలా! వీరిద్దరూ కలిసి ఒక మూవీ తీస్తున్నారంటే అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని సినీ ప్రియులు వేయికళ్ళతో ఎదురు చూస్తుంటారు. త్వరలో రాజమౌళి దర్శకత్వంలో రిలీజ్ కానున్న మహేష్ బాబు మూవీపై అందరి దృష్టి ఉంది. ఆగస్టు 9న సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు బర్త్ డే ఉంది. ఈనేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

మహేష్‌ కామెంట్స్..

“రాజమౌళితో కలిసి పని చేయడం అంటే నా కల నిజం కావడంలాంటిదే. రాజమౌళితో కొత్త సినిమా చేయడం అంటే.. ఒకేసారి 25 మూవీస్‌ చేయడంలాంటిదే. అది శారీరకంగా కాస్త ఎక్కువ డిమాండ్‌ చేసే మూవీయే. దీనిపై నేను చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. ఇది పాన్‌ ఇండియా మూవీ. అన్ని అడ్డంకులను అధిగమించి దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులకు మా సినిమా అందిస్తాం” అని మహేష్‌ కామెంట్స్ చేశారు. సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కలిసి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ” సర్కారు వారి పాట” మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మహేష్‌.. త్వరలోనే తన నెక్ట్స్‌ మూవీ ఎస్‌ఎస్‌ఎంబీ 28లో త్రివిక్రమ్‌తో చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ను త్వరలోనే ప్రారంభించనున్నారు. అయితే మహేష్‌తో సినిమాపై ఇప్పటికే రాజమౌళి కొన్నిసార్లు స్పందించినా.. ఈ రాజకుమారుడు మహేశ్ బాబు మాత్రమే ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు.

రాజమౌళి కొన్నిసార్లు స్పందించినా..

మహేష్‌, త్రివిక్రమ్‌ జోడీలో కొత్త సినిమా రాబోతోంది. దీని తర్వాతే రాజమౌళి.. మహేష్ తో సినిమాను మొదలుపెట్టనున్నాడు. అటు జక్కన్న ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌లోనే బిజీగా ఉన్నాడు. అయితే మహేష్‌తో సినిమాపై ఇప్పటికే రాజమౌళి కొన్నిసార్లు స్పందించినా.. ఈ రాజకుమారుడు మాత్రమే ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు. మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌ లోని ఈ మూవీ ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌లలో జరిగే కథగా చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యాక్షన్ సీక్వెన్స్‌లో ఈ మూవీలో ఉండబోతున్నట్లు సమాచారం. మహేష్‌తో తాను బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ కంటే కూడా గొప్ప సినిమా తీస్తానని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి మూడేళ్లు పట్టనుంది.