సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారా అన్న ఆసక్తి ఆడియన్స్ లో ఉంది. ఎస్.ఎస్.ఎం.బి 29వ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే తారస్థాయిలో అంచనాలు ఉన్నాయి. RRR తో ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి తను చేస్తున్న ఈ నెక్స్ట్ అటెంప్ట్ తో హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గకూడదని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలో మహేష్ సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ భామని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.
మహేష్ సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ హీరోయిన్ ఇండోనేషియా బ్యూటీ చెస్లియా ఇస్లాన్ ని ఎంపిక చేసినట్టు టాక్. రాజమౌళి ఏరి కోరి సెలెక్ట్ చేశాడంటే కచ్చితంగా ఆమె సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. సినిమాలో హీరోయిన్ పాత్రకు చెస్లియా పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారు. హాలీవుడ్ సినిమాలతో పాటుగా సీరీస్ లతో కూడా సూపర్ పాపులర్ అయిన చెస్లియా రాజమౌళి దృష్టిలో పడ్డది.
ఇక ఈ సినిమాలో చెస్లియాతో పాటుగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపిక పదుకొనే కూడా నటిస్తుందని అంటున్నారు. చెల్సియా, దీపిక ఈ ఇద్దరు హీరోయిన్స్ మహేష్ తో జత కడుతున్నారు. సినిమాకు గ్లామర్ విషయంలో ఎలాంటి డోకా లేకుండా ఉండేందుకు రాజమౌళి ఇలా ప్లాన్ చేశారు.
రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమా కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. మరి ఈ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read : Rashmika Mandanna : రష్మిక రెయిన్ బోకి అడ్డొచ్చిన కారణాలు ఏంటి..?