Site icon HashtagU Telugu

Rajamouli-Mahesh: జక్కన్నకు తలనొప్పిగా మారిన లీకుల బెడద.. కఠిన ఆంక్షలు అమలు చేస్తారా?

Rajamouli Mahesh

Rajamouli Mahesh

టాలీవుడ్ డైరెక్టర్ జక్కన్న, స్టార్ హీరో మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీ తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇది ఇలా ఉంటే ఇటీవలే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో కొంతమేర షూటింగ్ జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి షెడ్యూల్ పూర్తి కావడంతో ఇప్పుడు రెండవ షెడ్యూల్ లో భాగంగా అవుట్డోర్ షూటింగ్ కోసం ఒడిశా వెళ్లారట. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒడిశాలోని ఈస్ట్రన్ ఘాట్స్ లో SSMB 29 షెడ్యూల్ ప్లాన్ చేసారు. ఎత్తైన కొండల మధ్య షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసారు. షూటింగ్ స్పాట్ లోని కొన్ని ఫోటోలు, వీడియోలను అక్కడి స్థానిక మీడియా ఛానల్స్ లో ప్రసారం చేస్తున్నారు.

ఇవి చూసిన సినీ అభిమానులు జక్కన్న ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్ళ తర్వాత మహేష్ బాబు సినిమా అవుట్ డోర్ లో షూటింగ్ జరుపుకుంటోందని పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో లొకేషన్ ఫోటోలు ఇలా లీక్ అవ్వడం పట్ల జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. అయితే మామూలుగా రాజమౌళి తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడా కూడా చిన్న లీక్ అవ్వకుండా ఫోటోలు కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. రాజమౌళి సినిమాలు కట్టుదిట్టమైన భద్రత మధ్య షూటింగ్స్ జరుపుకుంటాయి. సెట్స్ లోకి మొబైల్ ఫోన్లను కూడా తీసుకెళ్లనివ్వరు. ఎలాంటి చిన్న విషయం కూడా బయటకు లీక్ అవ్వకుండా కేర్ తీసుకుంటారు. కానీ మహేష్ బాబు మూవీకి అలా జరగడం లేదు. అఫీషియల్ గా ప్రకటించకముందే ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటిస్తోందనే సంగతి రివీల్ అయ్యింది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తుండగా మొన్న మహేశ్ తో పాటుగా ఎయిర్ పోర్టులో కనిపించి ఆ వార్తలను కన్ఫార్మ్ చేసేసాడు. ఇప్పుడు ఒడిశా లొకేషన్స్ కు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. అయితే ఈ లీక్ లో పెడితే మాత్రం రాజమౌళికి కాస్త తలనొప్పి గానే మారింది. మరి ఇప్పటికైనా జక్కన్న ఇదివరకటి మూవీ లాగే కఠిన ఆంక్షలు విధిస్తారేమో చూడాలి మరి. అలా విధిస్తే తప్ప ఈ లీక్ లో బెడద తప్పేలా లేదు.