సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్.. ఈజ్ ఎ జర్నీ!

మీరు మహర్షి సినిమా చూశారా..? అందులో సక్సెస్ గురించి హీరో మహేశ్ బాబు తనదైన స్టయిల్ లో నిర్వచిస్తారు. సక్సెస్ అంటే డెస్టినేషన్ కాదు.. అదొక జర్నీ అంటాడు. సక్సెస్ కు ఫుల్ స్టాప్స్ ఉండవు. కేవలం కామస్ మాత్రమే ఉంటాయంటాడు.

  • Written By:
  • Updated On - October 5, 2021 / 11:58 AM IST

మీరు మహర్షి సినిమా చూశారా..? అందులో సక్సెస్ గురించి హీరో మహేశ్ బాబు తనదైన స్టయిల్ లో నిర్వచిస్తారు. సక్సెస్ అంటే డెస్టినేషన్ కాదు.. అదొక జర్నీ అంటాడు. సక్సెస్ కు ఫుల్ స్టాప్స్ ఉండవు. కేవలం కామస్ మాత్రమే ఉంటాయంటాడు. ఈ మూవీలోని డైలాగ్స్ హీరో మహేశ్ బాబుకు అతికినట్టుగా సరిపోతాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న మహేశ్ తన కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లను ఫేస్ చేశారు. తండ్రి అగ్రహీరో అయినప్పటికీ.. స్టార్ హీరోగా పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాడని అని చెప్పక తప్పదు. ఏ నటుడి కెరీర్ అయినా ఫ్లాపులు, హిట్స్ చాలా కామన్. మహేశ్ కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. రీసెంట్ గా మీడియా ముందుకొచ్చిన ఆయన తన ఫ్లాపుల గురించి ఇలా మాట్లాడారు.

‘‘ఒక సినిమా అన్నుకున్నట్లు రాకపోతే చాలా బాధేస్తుంది. ‘మహర్షి, భరత్ అనే నేను, శ్రీమంతుడు’ లాంటి సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. కానీ అంతకుమందు మాత్రం నా కెరీర్ ఏమాత్రం బాగుండేది కాదు. ఓ నటుడిగా స్పైడర్ లాంటి ప్రయోగాత్మక సినిమాలు చేసినా ఏమాత్రం వర్కవుట్ కాలేదు. ప్రేక్షకులు సైతం అలాంటి మూవీస్ రిజెక్ట్ చేశారు. అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఎక్కడ పొరపాట్లు జరిగాయి? ఏం చేయాలి? అనే విషయాలపై బాగా ఫోకస్ చేయాలి. ప్రయోగాత్మక సినిమాలు చేయాలని ఉన్నప్పటికీ ప్రొడ్యూసర్స్, డిస్టిబ్యూటర్స్ క్షేమం కోరి సినిమాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. సినిమా బడ్జెట్ కూడా కోట్లు దాటేస్తుంది కాబట్టి ఆచితుచి సినిమాలు చేయాల్సి ఉంటుంది. అందుకే సోషల్ అవేర్ నెస్ కూడిన కమర్షియల్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నా.

ప్రస్తుతం నా కెరీర్ చాలా బాగుంది. కానీ ప్రతి సినిమాపై అంచనాలు పెరిగే కొద్దీ.. నటుడిగా నాకు సవాలుగా మారుతోంది. సినిమా కథల ఎంపిక పూర్తిగా నా చేతుల్లోనే ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచే నా కథలను నేనే సెలెక్ట్ చేసుకుంటా. నా భార్య నమ్రత మాత్రం సినిమాకు సంబంధించిన బిజినెస్, ఇతర వ్యవహరాలు మాత్రమే చూసుకుంటుంది. గతంలో జరిగిన తప్పులు మళ్లీ మళ్లీ చేయకుండా జాగ్రత్త పడుతున్నందునే వరుస సక్సెస్ లు అందుకుంటున్నా’’ అని అన్నారు మహేశ్.