Site icon HashtagU Telugu

Mahesh Babu: ఫారిన్ టూర్ కు బయలుదేరిన మహేశ్ బాబు.. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఫోటో క్లిక్!!

Mahesh Babu

Mahesh Babu

ప్రతి సినిమా తర్వాత వెకేషన్లకు వెళ్లడం హీరో మహేష్ బాబుకు అలవాటు!! తాజాగా ” సర్కారు వారి పాట” మూవీ విజయం సాధించిన నేపథ్యంలో మహేష్ మళ్లీ ఫారిన్ టూర్ కోసం బయలుదేరారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో మహేష్ బాబు కారు దిగిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టీ షర్ట్, ట్రౌజర్స్, స్నికర్లు , నలుపు రంగు స్పోర్ట్స్ క్యాప్ లో మహేష్ బాబు స్మార్ట్ గా కనిపించారు. మహేశ్ వెంట కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. అయితే టూర్ కోసం ఎక్కడికి వెళ్లారనేది తెలియరాలేదు. శనివారం జరిగిన ” సర్కారు వారి పాట” స్పెషల్ ఈవెంట్ లో మహేశ్ తో పాటు ఆయన భార్య నమ్రత కూడా పాల్గొన్నారు. తన సినిమాకు అపూర్వ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, సినిమా నిర్మాణ టీమ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ మహేశ్ బాబు సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ లు చేశారు.

త్వరలోనే ఈ సినిమా కలెక్షన్లు రూ.100 కోట్లకు చేరే అవకాశాలు ఉన్నాయి. మహేష్ తదుపరి సినిమా రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకోనుంది. అది 2023లో రిలీజ్ కానుంది. SSMB28 టైటిల్ తో విడుదల కానున్న మరో సినిమాలోనూ మహేష్ యాక్ట్ చేయనున్నారు. ఇందులో హీరోయిన్ పాత్రను పూజా హెగ్డే పోషించనున్నారు.

Exit mobile version