Mahesh Babu : ఆ సినిమాలో నటించనని.. మహేష్ బాబు చెట్టెక్కి కూర్చున్నాడు..

పోరాటం సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో మహేష్ బాబు కూడా సెట్స్ కి వచ్చేవారట.

Published By: HashtagU Telugu Desk
Mahesh Babu not Interesting in Acting while Child Artist Kodi Ramakrishna changed Mahesh

Mahesh Babu not Interesting in Acting while Child Artist Kodi Ramakrishna changed Mahesh

మహేష్ బాబు(Mahesh Babu) చిన్నతనం నుంచే తన యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. నాలుగేళ్ళ వయసులోనే తండ్రి కృష్ణ(Krishna) నటించిన ‘నీడ’ అనే సినిమాలో నటించారు. అప్పటికి మహేష్ కి అంత ఊహా శక్తి లేదు. ఆ తరువాత 8ఏళ్ళ వయసులో రెండో సినిమాగా కృష్ణ నటించిన ‘పోరాటం'(Poratam) సినిమాలో నటించారు. కోడి రామకృష్ణ(Kodi Ramakrishna) దర్శకత్వం వచ్చిన ఈ సినిమాలో మహేష్.. కృష్ణ సోదరుడిగా నటించారు.

పోరాటం సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో మహేష్ బాబు కూడా సెట్స్ కి వచ్చేవారట. ఇక మహేష్ ని చూసిన కోడి రామకృష్ణకి.. సినిమాలో కృష్ణ తమ్ముడి పాత్రకి మహేష్ అయితే బాగుంటాడని అనిపించింది. అదే విషయాన్ని కృష్ణకి చెప్పగా, ఆయన నవ్వుతూ.. “అవునా. వాడు ఎవరి మాట వినడు అండి. వాడు అసలు ఒప్పుకోడు. మీకు కావాలి అనుకుంటే మీరే ఒప్పించుకోండి” అని చెప్పారట. ఆ సమయంలో మహేష్ బాబు.. సెట్స్ లో ఉన్న ఓ చెట్టు దగ్గర ఆడుకుంటున్నాడట.

ఇక మహేష్ దగ్గరకి వెళ్లిన కోడి రామకృష్ణ.. ‘బాబు నీకు సినిమాలో నటించాలని ఉందా..?’ అని ప్రశ్నించగా.. మహేష్ ‘లేదని’ బదులిచ్చాడట. ఎందుకు ఇష్టం లేదని రామకృష్ణ ప్రశ్నించగా, మహేష్ సమాధానమిస్తూ.. ‘సినిమా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మా నాన్నని చూస్తున్నానుగా’ అని తెలివిగా అవగాహన ఉన్నట్లు చెప్పాడట. అయినా సరే రామకృష్ణ, మహేష్ ని ఒప్పించే ప్రయత్నం చేయగా.. మహేష్ ‘నేను చేయను నేను చేయను’ అంటూ అక్కడే ఉన్న చెట్టు ఎక్కేశాడట.

మహేష్ బాబు చిన్నతనంలో అంత అల్లరి చేసేవాడట. అయితే చివరాఖరికి కోడి రామకృష్ణ, మహేష్ ని ఒప్పించారు. ‘నువ్వు చూడడానికి మీ నాన్న లాగానే ఉంటావు. ఆయనకి నువ్వే తమ్ముడిగా సరిపోతావు’ అని ఒప్పించారట. ఆ సినిమాలో మహేష్ కళ్లజోడతో చాలా క్యూట్ గా కనిపిస్తాడు. ఈ చిత్రం తరువాత కృష్ణ నటించిన పలు సినిమాల్లోనే మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మొత్తం ఎనిమిది సినిమాలు చేశారు మహేష్.

 

Also Read : Chiranjeevi : ఆ సినిమా చేయొద్దని పరుచూరి చెప్పినా.. చిరు వినకుండా చేసి ప్లాప్ అందుకున్నారు..

  Last Updated: 24 Jan 2024, 11:08 PM IST