Mahesh Babu : మహేష్ లో ఈ టాలెంట్ కూడానా.. బాబోయ్ బాబు మామూలోడు కాదండోయ్..!

సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) బయట కనిపించేంత అమాయకుడేమి కాదు. తనతో క్లోజ్ గా ఉండే వాళ్లతో చాలా జోవియల్ గా

Published By: HashtagU Telugu Desk
Mahesh Babu Guntur Karam Another Song Surprise

Mahesh Babu Guntur Karam Another Song Surprise

సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) బయట కనిపించేంత అమాయకుడేమి కాదు. తనతో క్లోజ్ గా ఉండే వాళ్లతో చాలా జోవియల్ గా మాట్లాడుతుంటారు. ఇక మహేష్ సెన్సాఫ్ హ్యూమర్ గురించి అందరికీ తెలిసిందే. సెట్ లో మహేష్ ఉన్నాడు అంటే ఇక అక్కడ అంతా కూడా సందడే సందడి. మహేష్ గుంటూరు కారం సినిమా రీసెంట్ గా రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. సినిమాకు మొదట టాక్ బాగా లేకపోయినా సంక్రాంతి సీజన్ లో మహేష్ మేనియాతో సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. మహేష్ స్టామినా ఏంటన్నది మరోసారి బాక్సాఫీస్ దగ్గర ప్రూవ్ అయ్యింది.

We’re now on WhatsApp : Click to Join

ఇక ఈ సినిమా సక్సెస్ సందర్భంగా సుమతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో మహేష్ క్యారెక్టరైజేషన్ కి సంబంధించి ఒక విషయాన్ని చెప్పాడు. మహేష్ తనలో ఒక స్పెషల్ క్వాలిటీ ఉందని అది త్రివిక్రం కు తెలుసని అన్నారు. ఇంతకీ మహేష్ లో ఉన్న ఆ టాలెంట్ ఏంటి అంటే ఎవరితో అయినా ఒక రెండు గంటలు మాట్లాడితే చాలు వారిలా తను ఇమిటేట్ చేయగలనని అంటున్నాడు మహేష్. ఆ విషయం త్రివిక్రం కు తెలుసు కాబట్టే ఏదైనా సీన్ లో చేయాలంటే మొన్న కలిశాం కదా అతనిలా చేయండని అంటే అలా చేస్తానని అన్నాడు.

గుంటూరు కారం లో రమణ పాత్రకు తనలో ఉన్న ఈ స్పెషల్ అబ్సర్వేషన్ చాలా ఉపయోగపడిందని అన్నారు మహేష్. అంతేకాదు నాన్న గారు చూడకుండా ఫ్యాన్స్ నే తన కలెక్షన్స్ గురించి చెప్పమని అడిగాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాను అన్న మాట మనసులోంచి వచ్చిదని.. ఆ క్రౌడ్ ని చూసి చాలా ఎమోషనల్ అయ్యానని అన్నారు మహేష్.

త్రివిక్రం డైరెక్షన్ లో తెరకెక్కిన గుంటూరు కారం మహేష్ చరిష్మాని మరోసారి చూపిస్తుంది. సినిమా నాలుగు రోజుల్లో 170 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసి సత్తా చాటింది. సినిమా సన్ర్కాంతి విన్నరా కాదా అన్నది పక్కన పెడితే కచ్చితంగా ఈ సీజన్ లో కూడా మహేష్ తన మార్క్ చూపించాడని చెప్పొచ్చు. సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా.. మీనాక్షి చౌదరి స్పెషల్ రోల్ లో నటించింది. సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు.

Also Read : Kiara Advani Lip Lock : భర్తతో ఘాటైన అదరచుంభనం.. ఇంటర్నెట్ షేక్ చేస్తున్న ఈ ఫోటో చూశారా..?

మహేష్ తో అతడు, ఖలేజా సినిమాల తర్వాత గుంటూరు కారం తెరకెక్కించిన త్రివిక్రం పూర్తిగా తన మార్క్ చూపించకపోయినా మహేష్ వన్ మ్యాన్ షోతో సినిమా గట్టేక్కేసింది. తప్పకుండా సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమాలోని మహేష్ చేసిన రమణ గాడి పాత్రని కొన్నాళ్ల పాటు గుర్తుంచుకుంటారు.

  Last Updated: 17 Jan 2024, 09:07 AM IST