Site icon HashtagU Telugu

Mahesh Babu : మహేష్ న్యూ లుక్.. పిచ్చెక్కిస్తున్నాడుగా..?

Mahesh Babu New Look Surprise With Sunrisers Hyderabad Team

Mahesh Babu New Look Surprise With Sunrisers Hyderabad Team

Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం రాజమౌళితో చేసే సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఎస్.ఎస్.ఎం.బి 29వ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది. ఈ సినిమా కోసం మహేష్ లాంగ్ హెయిర్ తో పూర్తిస్థాయిలో మేకోవర్ కానున్నాడు.

కొన్నాళ్లుగా మహేష్ లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నాడు కానీ క్యాప్ పెట్టుకుంటున్నాడు. ఈమధ్యనే రాజమౌళితో కలిసి దుబాయ్ లో కథా చర్చలకు వెళ్లొచ్చిన మహేష్ లేటెస్ట్ గా తన పూర్తి లుక్ రివీల్ చేశాడు.

ఐ.పి.ఎల్ లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తో కలిసి మహేష్ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఫోటోల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ తో పాటు మహేష్ కూడా షాకింగ్ లుక్ తో కనిపించాడు. మహేష్ ఈ లుక్ ఫ్యాన్స్ ని పిచ్చెక్కిస్తుంది.

దాదాపు రాజమౌళి సినిమాలో ఇదే లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది. ఫారెస్ట్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. సినిమాను బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ లా లేట్ చేయకుండా రెండేళ్లలో పూర్తి చేసి రిలీజ్ చేస్తానని చెబుతున్నాడు రాజమౌళి.

ఇక కమిన్స్ కెప్టెన్సీలో హైదరాబాద్ జట్టు ఐపిఎల్ లో అదరగొట్టేస్తుంది. ఐపిఎల్ లో ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక రికార్డుతో చెలరేగిపోతున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్.

ఐపిఎల్ చరిత్రలో 287 పరుగుల స్కోర్ తో రికార్డుని తమ పేరు మీద రాసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. దీన్ని బ్రేక్ చేసే స్టామినా కూడా తనకే ఉందని ఈ సీజన్ లోనే ప్రూవ్ చేసేలా ఉన్నారు.