Mahesh Babu CaFe: మరో బిజినెస్ లోకి మహేశ్.. బంజారాహిల్స్ లో కేఫ్ ఫ్రారంభం!

భారతీయ సెలబ్రిటీలు నటనలో కాకుండా ఇతర వ్యాపారాలలోకి ప్రవేశించడం కొత్తేమీ కాదు.

Published By: HashtagU Telugu Desk
Mahesh

Mahesh

భారతీయ సెలబ్రిటీలు నటనలో కాకుండా ఇతర వ్యాపారాలలోకి ప్రవేశించడం కొత్తేమీ కాదు. అయితే చాలామందికి రెస్టారెంట్ వ్యాపారం సిరులు కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని అనేక రెస్టారెంట్లు, కేఫ్‌ల యజమానులుగా టాలీవుడ్ స్టార్స్ చెలామణి అవుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో సౌత్ సెలబ్రిటీ మహేష్ బాబు కూడా చేరారు. ఇప్పటికే AMB థియేటర్స్ ప్రారంభించిన ప్రిన్స్ హైదరాబాద్‌లోని ఓ కేఫ్ ను ప్రారంభించారు. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో విలాసవంతమైన కేఫ్ ప్రారంభమైంది. ఇది నీలోఫర్ కేఫ్ పక్కనే ఉంది.

SS రాజమౌళి, అల్లు అర్జున్, లక్ష్మి మంచు తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. 111 మినర్వా కాఫీ షాప్, ప్యాలెస్ హైట్‌ల కలయిక’ తో డిసెంబర్ 1న గ్రాండ్ గా ఓపెన్ అయ్యింది. ‘AN’ అంటే ఆసియా నమ్రత. ఏషియన్ సినిమాస్ గ్రూప్ యజమాని, నిర్మాత సునీల్ నారంగ్ పూజా కార్యక్రమాలతో కేఫ్‌ను ప్రారంభించారు. సూపర్ స్టార్ కృష్ణను కోల్పోయిన బాధలో ఉన్న మహేష్ బాబు, అతని భార్య నమ్రతా శిరోద్కర్ దీనికి హాజరు కాలేదు.

  Last Updated: 03 Dec 2022, 02:20 PM IST